కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు, లెజెండరీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలి. అలాగే అన్ని ప్రయత్నాలలో నిరంతర విజయాలు కలిగేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలి.’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయక పాత్రల్లో నటించిన రజినీకాంత్ 1978లో విడుదలైన ‘భైరవి’ చిత్రంతో హీరోగా ఘనవిజయం అందుకుని సూపర్‌స్టార్‌గా మారారు. కాగా చిత్ర పరిశ్రమకు రజినీకాంత్ చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్(2000), పద్మవిభూషణ్(2016), దాదా సాహెబ్ ఫాల్కే(2019) అవార్డులతో సత్కరించింది. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమా ‘కూలీ’లో నటిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: