రజినీకాంత్‌ బర్త్ డే.. సినీ ప్రముఖుల విషెస్

Superstar Rajinikanth Birthday Tollywood Celebs Extends Special Wishes

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్‌ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పలువురు సినీ సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే పలు చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాయి.

అయితే రజినీకాంత్ అసలుపేరు శివాజీరావ్‌ గైక్వాడ్. ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన పేరుని ఆ చిత్ర దర్శకుడు కె బాలచందర్ రజినీకాంత్‌గా మార్చారు. కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయక పాత్రల్లో నటించిన రజినీకాంత్ 1978లో విడుదలైన ‘భైరవి’ చిత్రంతో హీరోగా ఘనవిజయం అందుకుని సూపర్‌స్టార్‌గా మారారు.

కాగా చిత్ర పరిశ్రమకు రజినీకాంత్‌ చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్(2000), పద్మవిభూషణ్(2016), దాదా సాహెబ్ ఫాల్కే(2019) అవార్డులతో సత్కరించింది. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమా ‘కూలీ’లో నటిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.