“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు తో పాటు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ హీరోగా రూపొందిన “అన్నాత్తే ” మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తలైవా కథానాయకుడిగా రూపొందిన బ్లాక్ బస్టర్ “ముత్తు “, “పడయప్పా “, “శివాజి “వంటి పలుచిత్రాలు జపనీస్ భాషలో డబ్బింగ్ వెర్షన్స్ జపాన్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. తన మేనరిజమ్స్ , స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో రజనీకాంత్ జపాన్ ప్రేక్షకులను అలరించారు. హీరో రజనీకాంత్ కు జపాన్ లో అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ , నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్ ” తమిళ మూవీ తెలుగు వెర్షన్ తో పాటు జపనీస్ వెర్షన్ కూడా 2020 జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యింది. తమిళ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన “దర్బార్” మూవీ తెలుగు లో ఏవరేజ్ గా నిలిచింది. “దర్బార్ “మూవీ జపాన్ లో రీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన పొందుతుంది .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: