ట్యాగ్ · 98 కథనాలు · పేజీ 5

'10' మందిలో '9' మంది అతని పేరే చెప్పారు..!
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్

'ఆర్ఆర్ఆర్' హిందీ టైటిల్ అదేనా..?
'ఆర్ఆర్ఆర్', కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని

వర్మపై రాజమౌళి కామెడీ - 'తాత' అయ్యాడు

2021 సంక్రాంతి పోరు - రాజమౌళి వర్సెస్ శంకర్..!
డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?

మారిన 'RRR' రిలీజ్ డేట్

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?
"బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి"మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ , ఇళ్ళను శుభ్రపరచడంలో మహిళల కంటే పురుషులు ఏ మాత్రం తీసిపోరు అనే "బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని సవాల్ చేశారు. ఆ సవాల్ ను స్వీకరించి తన ఇంటిని క్లీన్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఆ సవాల్ ను ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లకు రాజమౌళి విసిరారు.

'10' మందిలో '9' మంది అతని పేరే చెప్పారు..!
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా... కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో అజయ్ దేవగన్ కూడా ఒకరు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ను ఎలా ఎంపిక చేసుకున్నారో చెప్పారు రాజమౌళి.
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ పాల్గొన్న ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

"RRR" తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కు స్వంత వాయిస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ సుమారు 10 భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. అలియా భట్, ఒలీవియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో
ఫైనల్ గా రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇస్తానన్న సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది. నిజానికి ఈ రోజు 10 గంటలకే ఈ వీడియో రిలీజ్ అవ్వాలి. కానీ ఎందుకు లేట్ అయిందో తెలుసుగా. ఉదయం నుండి ట్విట్టర్ లో ఈ హడావుడే నడుస్తుంది. తాను పంపిస్తానన్న వీడియో నిట రాజమౌళి కి పంపించానని.. నీకు తెలుసుగా చరణ్ రాజమౌళి తో ఎలా ఉంటుందో.. సారి అంటూ ట్వీట్ చేయగా దానికి చరణ్ కూడా ఆయనకు పంపావా.. ఎప్పుడొస్తుంది అంటూ సెటైర్లు వేశారు. ఇక చిరు కూడా వీడియో కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేయగా దానికి రాజమౌళి... 'సా..ర్.. అంటే.. అది.. కొంచం.. కొంచమే.. ప్లీజ్.. సర్' అని ట్వీట్ చేశారు. కొంచం ఆలస్యం అవుతుందని చెప్పారు. దీనిపై…

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ సంక్రాంతి కానుకగా 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు కాగా అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్... ఇప్పుడు చరణ్ హీరోయిన్
టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ... ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా... అసలు సంగతేంటంటే...ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా.... అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్…

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో తారక్, చరణ్.. ఇద్దరూ పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించి అక్కడ అనుమతులు కూడా తీసుకున్నారని వినికిడి.

'ఆర్ఆర్ఆర్' హిందీ టైటిల్ అదేనా..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
'ఆర్ఆర్ఆర్', కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని
'ఆర్ఆర్ఆర్', 'కెజిఎఫ్2' రిలీజ్ డేట్ ల మధ్య గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఏడాది జులై 30 న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాకలేదు.. షూటింగ్ అవ్వాలి.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వాలి.. దీనితో సినిమా అనుకున్న డేట్ కు రావడం కష్టం. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మార్చుకున్న వెంటనే కెజిఎఫ్2 ఆర్ఆర్ఆర్ డేట్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అది కూడా పోయి.. కెజిఎఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ…
మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ?
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "RRR" మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు తో ఒక మూవీ రూపొందించాలనే కోరికను రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ తో ఒక మూవీ రూపొందించాలనే ఆసక్తి తో ఉన్న రాజమౌళి ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేశారని సమాచారం.

వర్మపై రాజమౌళి కామెడీ - 'తాత' అయ్యాడు
తన సినిమాల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వుండే రామ్ గోపాల్ వర్మ తాత అయ్యాడు. తాత ఏంటి... ఏదన్న సినిమాలో గెటప్ వేస్తున్నాడా..? అనుకుంటున్నారా..? రీల్ లో కాదులెండి... రియల్ లైఫ్ లో వర్మ తాత అయ్యాడు. రాంగోపాల్ వర్మ కూతురు రేవతికి 2013లో ప్రణబ్ అనే వ్యక్తితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఇద్దరూ యూఎస్ లో డాక్టర్స్ గా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది రేవతి.

రాజమౌళి ఫస్ట్ పొంగల్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
యస్. యస్. రాజమౌళి.. అపజయమంటూ ఎరుగని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. `స్టూడెంట్ నంబర్ 1` నుంచి `బాహుబలి - ది కంక్లూజన్` వరకు జక్కన్న రూపొందించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

2021 సంక్రాంతి పోరు - రాజమౌళి వర్సెస్ శంకర్..!
ఈ ఏడాది సంక్రాంతి పోరు ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి మాత్రం తెలుగు పరిశ్రమకు బాగాగే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. 'దర్బార్' తో మొదలైన సందడి.. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా, 'అల వైకుంఠపురములో', ' ఎంత మంచి వాడవురా' సినిమాల వరకూ సాగింది. దర్బార్ తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోగా.. మహేష్, బన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కలెక్టన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఇక కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమా కూడా మంచి టాక్ ను సొంత చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన "బాహుబలి", " బాహుబలి 2" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ "RRR"షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

మారిన 'RRR' రిలీజ్ డేట్
మొత్తానికి అనుకున్నదే జరిగింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ విషయంలో గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తూనే వున్నాయి. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని.. ముందు ఫిక్స్ చేసిన డేట్ కు రావడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.