ఈ ఏడాది సంక్రాంతి పోరు ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి మాత్రం తెలుగు పరిశ్రమకు బాగాగే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ‘దర్బార్’ తో మొదలైన సందడి.. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా, ‘అల వైకుంఠపురములో’, ‘ ఎంత మంచి వాడవురా’ సినిమాల వరకూ సాగింది. దర్బార్ తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోగా.. మహేష్, బన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కలెక్టన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఇక కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమా కూడా మంచి టాక్ ను సొంత చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పోరుకు ఇప్పటినుండే సినిమాలు క్యూ కడుతున్నాయి. వచ్చే ఏడాది మాత్రం సంక్రాంతి పోరు ఇంకాస్త గట్టిగానే వుండబోతున్నట్టుకనిపిస్తుంది. దానికి కారణం “ఆర్ఆర్ఆర్ “. ఈ ఏడాది జులై లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 2021 సంక్రాంతికి వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో 2021 సంక్రాంతి పోరు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు ఇప్పుడు మరో పెద్ద సినిమా కూడా వచ్చే సంక్రాంతి రిలీజ్ లిస్ట్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ సినిమా ఏదో కాదు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2.
[custom_ad]




1996 వచ్చిన శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను కూడా శంకర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్ధం లోపు షూటింగ్ ను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత నిర్మాణాంతర పనులు కూడా తొందరగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయడానికి చూస్తున్నాడట శంకర్.
మరి ఇదే కనుక జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి పోరు మాములుగా ఉండదు. వీరి సినిమాలకు అసలు వేరే హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలన్నా భయపడతారేమో. అలా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి వర్సెస్ శంకర్ అవుతుంది. చూద్దాం .. అప్పటివరకూ ఏమైనా జరగొచ్చు.. రిలీజ్ డేట్లు మారొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























