వర్మపై రాజమౌళి కామెడీ – ‘తాత’ అయ్యాడు

Rajamouli Pulls Leg Of Ram Gopal Varma,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rajamouli,Ram Gopal Varma,Rajamouli Comments On RGV,Director SS Rajamouli Funny Tweet On RGV,Rajamouli Comments On Director Ram Gopal Varma

తన సినిమాల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వుండే రామ్ గోపాల్ వర్మ తాత అయ్యాడు. తాత ఏంటి… ఏదన్న సినిమాలో గెటప్ వేస్తున్నాడా..? అనుకుంటున్నారా..? రీల్ లో కాదులెండి… రియల్ లైఫ్ లో వర్మ తాత అయ్యాడు. రాంగోపాల్ వర్మ కూతురు రేవతికి 2013లో ప్రణబ్ అనే వ్యక్తితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఇద్దరూ యూఎస్ లో డాక్టర్స్ గా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది రేవతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విషయంపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు వర్మ. అయితే ఇప్పుడు వర్మ తాత ఐన విషయం జక్కన్న రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ… తనదైన శైలిలో కామెంట్ చేసారు.‘‘కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ… మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?’ అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


[custom_ad]

కాగా రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా వున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =