‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని

‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్2’ రిలీజ్ డేట్ ల మధ్య గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఏడాది జులై 30 న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాకలేదు.. షూటింగ్ అవ్వాలి.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వాలి.. దీనితో సినిమా అనుకున్న డేట్ కు రావడం కష్టం. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మార్చుకున్న వెంటనే కెజిఎఫ్2 ఆర్ఆర్ఆర్ డేట్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అది కూడా పోయి.. కెజిఎఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై యష్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ కెజియఫ్2 మధ్య క్లాష్ అనేది జరగని పన‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ రెండు చిత్రాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది అనిల్ తడానీ , కాబట్టి రెండు ఒకే సమయంలో విడుదల అవడం జరగదన్నారు. ‘అలాంటి పిచ్చిపని తాము చేయబోమని, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో వారి సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో ముందుగానే తమకు ఆ విషయం చెప్పారని, అదే సమయంలో మీరు కేజీఎఫ్‌ 2ను రిలీజ్‌ చేయదల్చుకుంటే రిలీజ్‌ షెడ్యూల్‌ మార్చుకోవాలని సూచించారని అన్నారు. మరి చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో.

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌ని రాజ‌మౌళి మ‌రి కొద్ది రోజుల‌లో ఫ‌స్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఎఫ్2 తెరకెక్కుతుంది. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.