రాజ‌మౌళి ఫ‌స్ట్ పొంగ‌ల్ ఫిల్మ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా?

RRR First Pongal Release For Rajamouli,#RRR, #RRR Movie, Jr NTR, Latest Telugu Movies News, Rajamouli, Ram Charan, RRR Movie Updates, RRR Movie Release Date,Rajamouli Movie First Pongal Release, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

య‌స్. య‌స్. రాజ‌మౌళి.. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్. `స్టూడెంట్ నంబ‌ర్ 1` నుంచి `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్` వ‌ర‌కు జ‌క్క‌న్న రూపొందించిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే.. వీటిలో ఏ ఒక్క చిత్ర‌మూ టాలీవుడ్ ఫేవ‌రేట్ సీజ‌న్ అయిన పొంగ‌ల్ (సంక్రాంతి)కి రిలీజ్ కాలేదు. అయితే, ఆ ముచ్చ‌ట తీర్చ‌డానికి అన్న‌ట్లు `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి సీజ‌న్ లోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. తొలుత రాజ‌మౌళి ఫేవ‌రేట్ మంత్ గా పేరొందిన జూలై నెల‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించినా.. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ పేట్రియాటిక్ డ్రామాని 2021 జ‌న‌వ‌రి 8కి వాయిదా వేశారు. ఒక‌విధంగా సినీ ప్రియుల‌ను ఇది నిరాశ‌ప‌రిచే అంశ‌మైనా, 20 ఏళ్ళ కెరీర్ లో రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న వెరీ ఫ‌స్ట్ సంక్రాంతి ఫిల్మ్ `ఆర్ ఆర్ ఆర్` కావ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

[custom_ad]

అందునా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వంటి ఈ జ‌న‌రేష‌న్ స్టార్స్ తో రూపొందుతున్న సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ తోనే జ‌క్క‌న్న పొంగ‌ల్ బ‌రిలోకి దిగుతుండ‌డం స్కై హై ఎక్స్ పెక్టేష‌న్స్ కి కార‌ణ‌మ‌వుతోంది. మ‌రి.. త‌న ఫ‌స్ట్ స‌మ్మ‌ర్ రిలీజ్ అయిన `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్`తో ఇండియా వైజ్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ ని న‌మోదు చేసిన జ‌క్క‌న్న‌.. ఫ‌స్ట్ సంక్రాంతి రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్`తో అంత‌కుమించిన ఫ‌లితాన్ని అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =