
ట్యాగ్ · 32 కథనాలు


కూలీలో నాగార్జున

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్

కల్కి టీమ్‌కి సూపర్ డూపర్ కంగ్రాట్స్ - నాగార్జున

నా సామిరంగ టీజర్ రిలీజ్

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి

చైతూని చూస్తుంటే నాన్నగారు గుర్తుకొచ్చారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్ళు.. నాగార్జున స్పెషల్ వీడియో రిలీజ్
''రోడ్లే లేని రోజుల్లో నాన్నగారు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది టెక్నిషియన్స్, కొత్త ఆర్టిస్ట్ లు, కొత్త డైరెక్టర్స్ కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్ స్ఫూర్తి' అన్నారు కింగ్ అక్కినేని నాగార్జున.

కల్కిలో అమితాబ్‍ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన తెలుగు సినీ పరిశ్రమ
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళామంత్రి కామెంట్లను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది.

కూలీలో నాగార్జున
సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్
ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.

కల్కి టీమ్‌కి సూపర్ డూపర్ కంగ్రాట్స్ - నాగార్జున
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

నా సామిరంగ 2 డేస్ క్రేజీ కలెక్షన్స్
ఈ సంక్రాంతికి కూాడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కింగ్ నాాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ మూవీ కూడా ఒకటి. బిన్ని విజయ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నా సామిరంగ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది.

నా సామిరంగ టీజర్ రిలీజ్
విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ఈసినిమా మొదలై ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నిన్న అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది. అల్లరి నరేష్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.

నా సామిరంగ- ఇంట్రెస్టింగ్ గా అల్లరి నరేష్ పోస్టర్
కింగ్ నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున నుండి రాబోతున్న సినిమా నా సామిరంగ. చాలా కాలం తరువాత మళ్లీ ఓ మాస్ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున. విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?
తెలుగునాట 'బిగ్ బాస్' రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ ఏడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా 'ఉల్టా పుల్టా' అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్
కింగ్ నాగార్జున 99వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసినిమాతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశార.ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు
బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 6వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి కూడా కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్లలో వరుసపెట్టి మూడు సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హౌస్ లో నాగ్ కంటెస్టెంట్ లను డీల్ చేసే విధానం.. వారితో వ్యవహరించే తీరు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి.

బిగ్ బాస్ 6 అఫీషియల్ డేట్ ఫిక్స్
బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్ వచ్చి దాదాపు మూడు నెలలు సందడి చేస్తుంది. ఇక ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈసారి కూడా కింగ్ నాగార్జుననే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈషోకి సంబంధించిన ప్రోమోలతో నాగ్ కూడా వచ్చేశాడు.

"ది ఘోస్ట్ " మూవీ సోనాల్ చౌహాన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక దీనిలో భాగంగానే అప్ డేట్స్ స్టార్ట్ చేశారు. ఇక మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఇప్పటికే ఈసినిమా మోషన్ పోస్టర్ ను చూస్తే అర్థమైపోయింది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సౌత్ లో మాత్రం…

'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్
కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అలా చాలా రోజులపాటు పెండింగ్ లో ఉండి ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.