అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఏళ్ళు.. నాగార్జున స్పెషల్ వీడియో రిలీజ్

Nagarjuna Akkineni Shares Special Video on Eve of Annapurna Studios Completes 50 Years

”రోడ్లే లేని రోజుల్లో నాన్నగారు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎంతో మంది టెక్నిషియన్స్, కొత్త ఆర్టిస్ట్ లు, కొత్త డైరెక్టర్స్ కు ఉపాధి కల్పించింది. ఎంతో మందికి ఏయన్నార్‌ స్ఫూర్తి’ అన్నారు కింగ్ అక్కినేని నాగార్జున.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌ ఏర్పాటు చేసి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ప్రత్యేక వీడియోలో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “అన్నపూర్ణ స్టూడియోస్‌ కి 50వ ఏడు మొదలైయింది. నాన్న గారు ప్రతి సక్సెస్ ఫుల్ మ్యాన్ వెనుక ఒక విమెన్ ఉంటుందని నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనుక మా అమ్మగారు వున్నారని ఆయన బిలిఫ్.”

“అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్‌ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే వున్నారనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ప్లేస్ వారి ఫేవరేట్ ప్లేస్. అన్నపూర్ణ స్టాఫ్ ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. ఇవాళ స్టూడియో కళకళలాడుతుందంటే అది అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. వాళ్ళు అన్నపూర్ణ వారియర్స్.”

“ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మగారు నాన్నగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది.”

“లైఫ్ లో నాకు, మా పిల్లలకు, నాన్న గారు పెద్ద ఇన్స్పిరేషన్. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్ గా మాట్లాడతారు. ఆయన లైఫ్ పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ వుంటారు. ఏయన్నార్‌ లివ్స్ ఆన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని తెలిపారు నాగార్జున.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.