పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి తొలిరోజు వసూళ్ల సునామీనే సృష్టించింది. ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం డాలర్ల వర్షం కురిపించింది. తద్వారా 191 కోట్లకు పైగా గ్రాస్ సాధించి దేశవ్యాప్తంగా మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. ఈ సందర్భంగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని కల్కి చిత్రం సక్సెస్‌పై స్పందించారు.
ఈ మేరకు ఎక్స్‌లో ఆయన.. “కల్కి 2898 AD బృందానికి సూపర్ డూపర్ అభినందనలు!! నాగి మీరు మమ్మల్ని వేరే కాలానికి మరియు మరొక లోకానికి తీసుకెళ్లారు. పురాణాలు మరియు చరిత్రను చాలా అద్భుతంగా అల్లుకున్న కల్పన!! అసలైన మాస్ హీరో అమిత్ జీ.. సార్, ఇందులో మీ ఫైర్ కనిపించింది. సీక్వెల్‌లో కమల్ జీ ని చూడటానికి వేచి ఉండలేను.. ఇందులో ఆయన కనిపించేది కొద్దిసేపే, అందుకే ఆయన నటనను పూర్తిగా ఆస్వాదించలేకపోయా!” అని తెలిపారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ప్రభాస్ నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే ది బెస్ట్ చేసావు!! దీపికా జీ.. మీరు దివ్యమైన తల్లిలా చాలా అద్భుతంగా మరియు కన్విన్సింగ్‌గా ఉన్నారు!! మరియు మిగిలిన టీమ్.. అశ్విని దత్ గారూ, ప్రియమైన స్వీటీ మరియు స్వప్నా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు! ఇండియన్ సినిమా మళ్లీ వండర్ చేసింది!!” అని పేర్కొన్నారు హీరో నాగార్జున.
కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: