
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 19


సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు

కోర్ట్ స్పెషల్ షో టాక్

నాని గారు అలా చెప్పగానే షాకయ్యాం

కోర్ట్ చూశాక నాని గారు ఏమన్నారంటే..?

ఛాంపియన్ నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

రాబిన్ హుడ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్

ఈ సమ్మర్ చాలా స్పెషల్.. డజన్ సినిమాలు రెడీ

ఒడిశాలో SSMB29 షూటింగ్.. డిప్యూటీ సీఎం స్పెషల్ పోస్ట్

దిల్ రూబాకి పెయిడ్ ప్రీమియర్లు

కూలీ అప్డేట్ రానుంది

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ టీజర్ డేట్ ఫిక్స్

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు
వరస ప్లాప్ ల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా 2023 చివర్లో వచ్చి 600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అయితే సరైన టైం లో వచ్చి ఉంటే 1000కోట్ల సినిమా అయ్యుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూవుంటారు.యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది ఈసినిమా.కేవలం థియేటర్లలోనే కాదు ఓటిటి ల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ చాలా రోజులు ట్రెండింగ్ లో కొనసాగింది.ఇందులో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఫైనల్ గా ఓటిటిలోకి ఏజెంట్
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 5వ సినిమా ఏజెంట్ భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.ఇక ఆతరువాత థియేటర్లలో విడుదలై రెండేళ్ళు దాటినా ఓటిటి లోకి రాలేదు.ఇంతకుముందు పలు మార్లు డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.రీసెంట్ గా సోనీ లివ్ ఈనెల 14న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి రానుందని ప్రకటించింది.అయితే అంత కన్నా ఒక రోజు ముందుగానే ఈ రోజు సాయంత్రం నుండే ఏజెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.మరి ఆలస్యంగా ఓటిటి లోకి వచ్చిన ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

కోర్ట్ స్పెషల్ షో టాక్
హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుండే నాని నిర్మాత గా కూడా మారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తు వస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా నాని నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. రేపు ఈసినిమా విడుదలకానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.నాని ఈసినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.కోర్ట్ నచ్చకుంటే హిట్ 3 చూడకండి అని స్టేజ్ మీదే చెప్పేశాడు.అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నాడు.

నాని గారు అలా చెప్పగానే షాకయ్యాం
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, అలానే 'ప్రేమలో' సాంగ్ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి.

పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ రిలీజ్.. సప్తగిరి కామెడీ నెక్స్ట్ లెవెల్
ప్రముఖ కమెడియన్ సప్తగిరి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'పెళ్లి కాని ప్రసాద్'. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కతోన్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ ఫిమేల్ లీడ్ రోల్లో నటించారు. కె.వై. బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డ్ ముత్యాల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కాని ప్రసాద్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కోర్ట్ చూశాక నాని గారు ఏమన్నారంటే..?
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ సినిమా విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాంకి బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.

ఛాంపియన్ నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహా దంపతుల కుమారుడు రోషన్ కొన్నేళ్ళక్రితం 'నిర్మలా కాన్వెంట్' (2016) అనే చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే రోషన్ తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతోంది. చివరిసారి అతను 2021లో వచ్చిన రెండో సినిమా 'పెళ్లిసందD'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనితర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.

రాబిన్ హుడ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్
భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్.ఈనెల 28న థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నారు.అందులో భాగంగా వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంది రాబిన్ హుడ్ టీం.నితిన్ తోపాటు హీరోయిన్ శ్రీ లీల కూడా చాలా యాక్టీవ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

ఈ సమ్మర్ చాలా స్పెషల్.. డజన్ సినిమాలు రెడీ
సాధారణంగా సినిమా వాళ్ళకి పండుగలు మంచి సీజన్. అలాగే సమ్మర్ సీజన్ కూడా. స్కూళ్లకు, కాలేజీలకు దాదాపు 2 నెలలు సెలవులు ఉన్నందున చాలామంది నిర్మాతలు ఆ సమయంలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగ్గట్టే ప్లానింగ్ చేసుకుంటుంటారు.

ముఫాసా: ది లయన్ కింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
డిస్నీ స్టూడియోస్ తెరకెక్కించిన లేటెస్ట్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్'. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందింది. ఇండియాలో ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ సహా ప్రధాన భాషల్లో విడుదలయింది.

ఒడిశాలో SSMB29 షూటింగ్.. డిప్యూటీ సీఎం స్పెషల్ పోస్ట్
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దిల్రూబా.. కో స్టార్‌గా కిరణ్ గారి సపోర్ట్ సూపర్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా 'దిల్రూబా'. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దిల్ రూబాకి పెయిడ్ ప్రీమియర్లు
రీసెంట్ గా క తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఇక ఈ హీరో రెండు రోజుల్లో దిల్ రూబా తో రానున్నాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ప్రమోషన్ ఈవెంట్ లో ఈసినిమా నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా నచ్చకపోతే నన్ను వచ్చి కొట్టొచ్చు అని సినిమా మీద వున్న నమ్మకంతో స్టేజ్ మీద చెప్పాడు.ఇక టీం ఇంకో అడుగు ముందుకేసి పెయిడ్ ప్రీమియర్లు వేయాలని చూస్తున్నారు. రేపు రాత్రి సెలక్టెడ్ థియేటర్లలో ప్రీమియర్లు వేయనున్నారు.అందులో గనక టాక్ పాజిటీవ్ గా టాక్ వస్తే అడ్వాంటేజ్ అవ్వనుంది.

ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ - TFDC చైర్మన్ దిల్ రాజు
తెలంగాణలో ఇకపై ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ అందజేస్తామని ప్రకటించారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ మేరకు ఆయన ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఈరోజు సమాచార భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించనున్నామని, ఆ సినిమాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.

కూలీ అప్డేట్ రానుంది
వేట్టయన్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో రానున్నాడు.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర , శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.ఇక ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసే యోచన లో వున్నారు మేకర్స్.అన్ని కుదిరితే లోకేష్ బర్త్ డే మార్చి 14న ఈసినిమా టీజర్ వచ్చే ఛాన్స్ వుంది.లేదంటే మరో అప్డేట్ ఏదైనా ఇవ్వాలని చూస్తున్నారు.

దిల్రూబా.. ప్రీమియర్స్ తోనే సక్సెస్ జర్నీ స్టార్ట్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా 'దిల్రూబా'. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రాబిన్‌హుడ్.. ఆ సినిమాలకి మించి సక్సెస్ అవుతుంది
హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ టీజర్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో కళ్యాణ్ రామ్ కు తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది.దాంతో ప్రమోషన్ కంటెంట్ ను రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈసినిమా ప్రీ టీజర్ ను ఈనెల 14న విడుదలచేయనున్నారు.ఫుల్ టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో అందులో చెప్పనున్నారు.అన్ని కుదిరితే వచ్చే వారంలో టీజర్ రానుంది.