విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో విడుదలైన ప్రతిచోటా సక్సెస్ ఫుల్ రన్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకే సమయానికి టీవీ, ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. జీ5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో అతి తక్కువ సమయంలో.. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ‘ఆర్ఆర్ఆర్, హనుమాన్’ పేరిట ఉండేది. ప్రస్తుతం 310 స్ట్రీమింగ్ మినిట్స్
ఇక ఇదిలావుంటే, మరోవైపు టెలివిజన్‌లో సైతం ఈ చిత్రం దుమ్మురేపుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో 18.1 TRP రేటింగ్ సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈమధ్య కాలంలో ఇంత హై రేటింగ్ తెచ్చుకున్న మూవీ మరోటిలేదు. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం 19.5 రేటింగ్‌తో మొదటిస్థానంలో నిలిచి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు ఈ మూవీ రెండో స్థానం దక్కించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: