టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహా దంపతుల కుమారుడు రోషన్ కొన్నేళ్ళక్రితం ‘నిర్మలా కాన్వెంట్’ (2016) అనే చిత్రంతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే రోషన్ తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతోంది. చివరిసారి అతను 2021లో వచ్చిన రెండో సినిమా ‘పెళ్లిసందD’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనితర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రోషన్ హీరోగా ‘ఛాంపియన్’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దీనికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచింది చిత్ర యూనిట్. నేడు రోషన్ జన్మదినం సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ఈ యువ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపింది. “ఆట ఇప్పుడు మొదలవుతుంది.. మరియు ఛాంపియన్ వచ్చాడు. మన ‘ఛాంప్’ రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ఎక్స్‌లో పేర్కొంది.
అలాగే రోషన్ పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ మంచి ఇంటెన్స్‌తో ఆకట్టుకునేలావుంది. దీనిని చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రోషన్ ఫుట్‌బాల్ (సాకర్) ప్లేయర్‌గా కొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్టు అర్ధమవుతోంది. కాగా ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: