భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్.ఈనెల 28న థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నారు.అందులో భాగంగా వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంది రాబిన్ హుడ్ టీం.నితిన్ తోపాటు హీరోయిన్ శ్రీ లీల కూడా చాలా యాక్టీవ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు వెంకీ కుడుముల, నితిన్ ల మధ్య జరిగిన పాడ్ కాస్ట్ సంభాషణను ఎపిసోడ్ 1ను రిలీజ్ చేశారు.మొత్తానికి సినిమాను ఎంత ప్రమోట్ చేయగలితే అంత చేస్తున్నారు.నితిన్ కు ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది. సరైన విజయం కోసం చాలా రోజుల నుండే ఎదురుచూస్తున్నాడు.ప్లాప్ తెలియని డైరెక్టర్ , క్రేజ్ వున్న హీరోయిన్ ,టాప్ ప్రొడక్షన్ ఈకాంబో లో రాబిన్ హుడ్ చేసిన నితిన్ కు కం బ్యాక్ అవ్వడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.
ఈ సినిమా విజయంపై అయితే నితిన్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.సాంగ్స్ జనాల్లోకి వెళ్లాయి.ట్రైలర్ రావాల్సివుంది.అయితే ఈసినిమా రిలీజ్ అవుతున్న రోజే మ్యాడ్ స్క్వేర్ కూడా వస్తుంది.దాంతో రాబిన్ హుడ్ కి పోటీ తప్పేలాలేదు.
ఇక ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు.వేణు శ్రీరామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మేలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.మరి రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో వస్తున్న నితిన్ కు ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: