ఈ సమ్మర్‌ చాలా స్పెషల్.. డజన్ సినిమాలు రెడీ

Hari Hara Veera Mallu, Robinhood, Bhairavam, Kannappa, Kingdom Along With Total 12 Movies Ready For Release This Summer

సాధారణంగా సినిమా వాళ్ళకి పండుగలు మంచి సీజన్. అలాగే సమ్మర్ సీజన్ కూడా. స్కూళ్లకు, కాలేజీలకు దాదాపు 2 నెలలు సెలవులు ఉన్నందున చాలామంది నిర్మాతలు ఆ సమయంలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగ్గట్టే ప్లానింగ్ చేసుకుంటుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే ఈ సమ్మర్ కూడా సిద్దమవుతోంది. అయితే ఈసారి మాత్రం చాలా స్పెషల్ గా ఉండనుంది. ఎందుకంటే, ఈ సీజన్ లో దాదాపు 12 చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఇవన్నీ డైరెక్ట్ తెలుగు సినిమాలే. ఇక వీటితోపాటుగా అజిత్ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా రిలీజ్ అవుతోంది.

మార్చి 28 నుండి, దాదాపు ప్రతి వారం ఒక సినిమా విడుదలకానుంది. అయితే స్వల్ప వ్యవధిలో ఇన్ని చిత్రాలు రిలీజ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలన్నింటికీ థియేటర్లు దొరకడం కూడా పెద్ద సవాలుతో కూడుకున్న పనే. దీంతో కొన్ని చిత్రాలకు తగినంత థియేటర్లు కూడా లభించకపోవచ్చని అంటున్నారు.

అయితే వీటిలో చాలావరకు స్టార్ హీరోల సినిమాలు కావడం, అందునా వాటిపై మంచి మార్కెట్లో మంచి బజ్ ఉండటంతో మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదీగాక, చాలా సంవత్సరాల తర్వాత, టాలీవుడ్‌లో వేసవికి ఇంత భారీ సంఖ్యలో చిత్రాలు విడుదల కానుండటం ఆసక్తిదాయకంగా మారింది.

కాగా ఈ సమ్మర్‌లో రిలీజ్ కానున్న చిత్రాలు..

  • సుందరకాండ (మార్చి 14)
  • హరిహర వీరమల్లు (మార్చి 28)
  • రాబిన్‌హుడ్ (మార్చి 28)
  • మ్యాడ్ స్క్వేర్ (మార్చి 29)
  • కింగ్ డమ్ (మార్చి 30)
  • జాక్ (ఏప్రిల్ 10)
  • గుడ్ బ్యాడ్ అగ్లీ (ఏప్రిల్ 10)
  • అర్జున్ సన్నాఫ్ వైజయంతి (ఏప్రిల్ 17)
  • ఘాటి (ఏప్రిల్ 18)
  • కన్నప్ప (ఏప్రిల్ 25)
  • హిట్ 3 (మే 1)
  • సింగిల్ (మే 14)
  • భైరవం
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.