యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 5వ సినిమా ఏజెంట్ భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.ఇక ఆతరువాత థియేటర్లలో విడుదలై రెండేళ్ళు దాటినా ఓటిటి లోకి రాలేదు.ఇంతకుముందు పలు మార్లు డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.రీసెంట్ గా సోనీ లివ్ ఈనెల 14న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి రానుందని ప్రకటించింది.అయితే అంత కన్నా ఒక రోజు ముందుగానే ఈ రోజు సాయంత్రం నుండే ఏజెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.మరి ఆలస్యంగా ఓటిటి లోకి వచ్చిన ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మళయాలం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించాడు.హిప్ హప్ తమిళ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈసినిమాను నిర్మించాడు.
ఈసినిమా ఇచ్చిన షాక్ తో అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఇప్పటివరకు అఫీషియల్ గా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు కానీ తన 6వ సినిమా సైలెంట్ గా షూటింగ్ మాత్రం జరుపుకుంటుందని టాక్ .వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుందట.అయితే ఈసినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: