సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు, మీడియా మిత్రులు, నా ఫ్యాన్స్ కు నమస్కారం. నా ప్రతి సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, డీవోపీ డేనియల్ విశ్వాస్ తప్పకుండా ఉంటారు. వీళ్లు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. “దిల్ రూబా”కు సామ్ సీఎస్ గారు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఆయన మ్యూజిక్ కోసమైనా మీరు దిల్ రూబా చూడాలి.”
“ఇక మా మూవీతో ‘సారేగమా’ వారు అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లవుతోంది. పది సినిమాలు చేశాను. కిరణ్ కష్టపడుతున్నాడు అని మీరంతా నా సినిమాల పట్ల ఆదరణ చూపిస్తున్నారు. ఇదే ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా. నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే పది మంది కిరణ్ అన్న అభిమానులం అని నా వెంట ఉండేవారు. ఇప్పుడా పది మంది వందలు, వేలు అయ్యారు.”
“నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలంటే ఎమోషన్ అవుతాను. మీ అభిమానం కాపాడుకుంటూ గర్వపడేలా సినిమాలు చేస్తానని చెబుతున్నా. సినిమా ఇండస్ట్రీలోకి హోప్ తో వచ్చే ఎంతోమంది ఇక్కడి కష్టాలు పడలేక తిరిగి వెళ్లిపోవడం చూశా. కానీ మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీరూ నాలాగా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. ఊర్ల నుంచి సినిమా మీద ప్యాషన్ తో వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా నేను సాయం చేస్తా.”
“అది ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అవకాశాలు కానీయండి నా వల్ల చేతనైన సాయం వారికి చేస్తా. నేను ఇంకా సక్సెస్ అయితే ఏటా వందమంది ఔత్సాహికులకు సాయం చేయాలనుకుంటున్నా. నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నా. ఇకపైనా ఆ ప్రయత్నం కొనసాగిస్తా. మొదట్లో దిల్ రూబాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడిన మాట నిజం. అయితే ఇప్పుడు మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.”
“ఈ నెల 14న కాదు 13 సాయంత్రమే దిల్ రూబా ప్రీమియర్స్ తో మా సక్సెస్ జర్నీ స్టార్ట్ కాబోతోంది. హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోండి. సినిమా 2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ ఫీల్ కారు. క సినిమాలో కంటెంట్ చూశారు. దిల్ రూబాలో కిరణ్ అబ్బవరంను చూస్తారు. విశ్వకరుణ్ నన్ను సినిమాలో చూపించిన విధానం, నాతో చెప్పించిన డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.”
“వుమెన్ ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వెళ్లండి. మీ మీద రెస్పెక్ట్ తో ఈ సినిమా చేశాం. ఫ్యామిలీస్ అంతా దిల్ రూబాకు వెళ్లండి. మీరు ఇబ్బందిపడే ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా సినిమాలో ఉండదు. ఇంత క్లీన్ గా కమర్షియల్ సినిమా తీయగలరా అని దిల్ రూబా చూశాక మీరే అంటారు. ఇది న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేను కానీ మీ టైమ్ ను వృథా చేయను, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని మాత్రం ఇవ్వగలను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: