హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుండే నాని నిర్మాత గా కూడా మారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తు వస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా నాని నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. రేపు ఈసినిమా విడుదలకానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.నాని ఈసినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.కోర్ట్ నచ్చకుంటే హిట్ 3 చూడకండి అని స్టేజ్ మీదే చెప్పేశాడు.అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటికి రెస్పాన్స్ బాగుండడం తో మరి కొన్ని షోస్ యాడ్ చేశారు.ఇక నిన్న ప్రెస్ తో పాటు మరికొంత మందికి స్పెషల్ షో వేశారు.ఇక ఈ షో నుండి అదిరిపోయిందన్న టాక్ వినిపిస్తుంది.ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా చాలా బాగా తీశారని ముఖ్యంగా శివాజీ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి సినిమా మీద నాని పెట్టుకున్న నమ్మకం నిజం కానుంది.
పోక్సో యాక్ట్ నేపథ్యంలో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక,వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: