వరస ప్లాప్ ల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా 2023 చివర్లో వచ్చి 600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అయితే సరైన టైం లో వచ్చి ఉంటే 1000కోట్ల సినిమా అయ్యుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూవుంటారు.యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది ఈసినిమా.కేవలం థియేటర్లలోనే కాదు ఓటిటి ల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ చాలా రోజులు ట్రెండింగ్ లో కొనసాగింది.ఇందులో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది.గత కొన్నేళ్ల నుండి ఎక్కువగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సలార్ మళ్ళీ రిలీజ్ కానుంది.మార్చి 21న విడుదలకానుంది.దాంతో క్రేజ్ మాములుగా లేదు.బుక్ మై షో లో హైదరాబాద్ లో మొదటి రోజు లిమిటెడ్ షోస్ ఓపెన్ కాగా అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి.సెకండ్ డే కూడా కొన్ని షోస్ ఫుల్ అయ్యాయి.మరి సలార్ రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.
ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా రానుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం తో ఆలస్యం కానుంది.అన్ని కుదిరితే వచ్చే ఏడాదే సలార్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.ఎన్టీఆర్ తో సినిమాను పూర్తి చేసి కానీ ప్రశాంత్ నీల్ సలార్ 2 ను స్టార్ట్ చెయ్యడు.ఈలోగా ప్రభాస్ ది రాజాసాబ్ ,ప్రభాస్ హను ,స్పిరిట్ సినిమాలను పూర్తి చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: