ఒడిశాలో SSMB29 షూటింగ్.. డిప్యూటీ సీఎం స్పెషల్ పోస్ట్

Odisha Deputy CM Pravati Parida Special Post on SSMB29

‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ద‌ర్శ‌కధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘#SSMB29’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో దీనిపై అంతటా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా, మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్రవతి పరిదా తాజాగా ఈ సినిమాపై స్పందించారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం తమకు ఎంతో గర్వకారణమని, చిత్ర యూనిట్‌కి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా.. “గతంలో మల్కాన్‌గిరిలో పుష్ప-2, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రాబోయే చిత్రం SSMB29, దక్షిణాది సూపర్‌స్టార్‌లు మహేష్ బాబు మరియు పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రాతో కలిసి కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఒడిశాలో సినిమా షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఉందని రుజువు చేస్తుంది.” అని తెలిపారు.

ఇంకా కొనసాగిస్తూ.. “ఈ చర్య ఒడిశా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది ప్రధాన షూటింగ్ గమ్యస్థానంగా మారుతుంది. ఒడిశా సామర్థ్యాన్ని అన్వేషించడానికి అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నాము. అలాగే పూర్తి మద్దతు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాము” అని ఒడిశా ఉప ముఖ్య‌మంత్రి ప్రవతి పరిదా పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.