కోర్ట్ చూశాక నాని గారు ఏమన్నారంటే..?

Director Ram Jagadeesh Reveals Interesting Facts About Court Movie

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ సినిమా విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జగదీష్ గారు ఈ కథ చేయడానికి మీకు స్ఫూర్తి?

  • ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది.
  • నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను.
  • ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది.
  • ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది.
  • ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను.
  • ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి.
  • ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది.
  • ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను.
  • అన్ని కేస్ ఫైల్స్‌లో ఉన్న మెటీరియల్‌తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది.
  • అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్‌పై చూపించడం జరిగింది.
  • ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన కథ కాదు.
  • ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ కథ. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది.
  • చదివిన కేసుల ఎసెన్స్‌తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.
  • ఈ సినిమా కోసం పోక్సో యాక్ట్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాను.
  • కోర్టు, లా, పోలీస్‌కి సంబధించిన చాలా మందిని కలసి చాలా విషయాలు గ్యాదర్ చేశాను.

నాని గారికి కథ చెప్పడం ఎలా అనిపించింది?

  • నాని గారికి కథ చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్.
  • ఆయనకి కథ చెప్పడానికి దాదాపు 8 నెలలు వెయిట్ చేశాను.
  • ఫైనల్‌గా ఆయన కథ వినే మూమెంట్ వచ్చింది.
  • ఆయన కథ విన్న విధానం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది.
  • దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్‌లో విన్నారు.
  • కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి ‘వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా’ అన్నారు.
  • అది నా జీవితంలో హై మూమెంట్. అది నిజంగా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌.

చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి కదా ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది?

  • చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం.
  • కానీ ఒక లవ్ స్టోరీని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను.
  • ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

పోక్సో చట్టం ఈ కథలో ఏమేరకు ఉంటుంది?

  • పోక్సో చాలా ముఖ్యమైన యాక్ట్.
  • నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు.
  • దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తే బాగుంటుందని అనిపించింది.
  • అది ఈ సినిమాలో చూస్తారు.

రోషన్ శ్రీదేవి క్యారెక్టర్స్ గురించి?

  • ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం.
  • చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు.
  • సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు.
  • చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం.
  • ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి.
  • ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం.
  • అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ పంపించాడు.
  • అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది.
  • అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది,

ప్రియదర్శి గారి క్యారెక్టర్ గురించి?

  • ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను.
  • ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను.
  • ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను, ఆయనతోనే చేశాను.
  • ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్.
  • చాలా ఫ్రెండ్లీగా వుంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.

శివాజీ గారి క్యారెక్టర్ గురించి?

  • శివాజీ గారు మంగపతి క్యారెక్టర్‌లో కనిపిస్తారు.
  • ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది.
  • ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు.
  • రియల్ లైఫ్ క్యారెక్టర్‌లా ఉంటుంది.

టెక్నికల్‌గా సిన్మియా ఎలా వుంటుంది?

  • ఈ కథ అనుకున్నప్పుడే టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్‌గా వుండాలని ఫిక్స్ అయ్యాం.
  • విజయ్ ‘బేబీ’తో ప్రూవ్ చేసుకున్నారు.
  • ఈ సినిమాకి కూడా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.
  • ఈ సినిమాకి దినేష్ పురుషోత్తమన్ డీవోపీగా చేశారు.
  • ఆయన రెండు 100కోట్ల సినిమాలు చేసిన డీవోపీ.
  • మా సినిమా కథ విని ఓకే చేశారు. విజువల్స్ చాలా లైవ్లీగా వుంటాయి.

పరిశ్రమలో మీ జర్నీ గురించి?

  • ఇంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’, రారా క్రిష్ణయ్యా సినిమాలు చేశాను.
  • అలాగే ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది.

ప్రొడక్షన్ సైడ్ సపోర్ట్ ఎలా వుంది?

  • దీప్తి గారు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు.
  • ఏది ఎప్పుడు చేస్తే ఇన్ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందో అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు.
  • వాల్ పోస్టర్ సినిమాలో చేయడం నా అదృష్టం.

నాని గారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుందని చెప్పడానికి కారణం?

  • నాని గారు సినిమా చూశారు. సినిమాపై ఆయనకి వున్న కాన్ఫిడెన్స్ అది.
  • ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే.
  • నాని గారు సినిమా చూసి ‘ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్’ అన్నారు.
  • అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్

ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి ఏం చెబుతారు?

  • ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం.
  • స్క్రీన్ మీద మన జీవితమే వుంటుంది.
  • మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను.
  • ఈ సినిమా విషయంలో అందరం చాలా హ్యాపీగా వున్నాం.
  • నేను ఎలా వుండాలని అనుకున్నానో అలా వుంది సినిమా.
  • నేను రాసింది అద్భుతంగా తెరపైకి వచ్చింది.
  • ఇది కమర్షియల్ సినిమానే.
  • సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు.
  • ఆ మాట నాకు చాలా నచ్చింది.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.