సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రూబా సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. “దిల్‌రూబా సినిమాలో ‘అంజలి’ క్యారెక్టర్‌లో నటించాను. అంజలి క్యారెక్టర్ ఎనర్జిటిగ్ గా ఉంటూనే ఎంతో ఎమోషనల్ డ్రైవ్‌తో సాగుతుంది. డెప్త్ ఉన్న డైలాగ్స్ నాతో చెప్పించారు దర్శకుడు విశ్వ కరుణ్ గారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కో స్టార్‌గా కిరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ అందించిన సహకారం మర్చిపోలేనిది. నా ‘కృష్ణార్జున, అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాలను మీరంతా ఆదరించారు. అలాగే దిల్‌రూబా చిత్రాన్ని కూడా ఈ నెల 14న థియేటర్స్ లో చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు.
అలాగే మరో హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ.. “లైఫ్‌లో మ్యాజిక్ ఒక్కసారే జరుగుతుంది. నా కెరీర్ విషయంలో ఆ మ్యాజిక్ దిల్‌రూబా సినిమాతో జరిగింది. ఈ చిత్రంలో మ్యాగీ క్యారెక్టర్‌లో నటించాను. ఇలాంటి మంచి క్యారెక్టర్‌తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కిరణ్ గారు కోస్టార్‌గా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ నెల 14న థియేటర్స్‌లో మా దిల్‌రూబా సినిమా చూసి మీ రెస్పాన్స్ చెప్పండి” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: