ప్రముఖ కమెడియన్ సప్తగిరి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతోన్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించారు. కె.వై. బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డ్ ముత్యాల సంయుక్తంగా నిర్మిస్తుండగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కాని ప్రసాద్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ వంశానికి చెందిన శాసనాల గ్రంధాన్ని అనుసరించే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన కథానాయకుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనే దానిని హాస్యభరితంగా రూపొందించారు. పెళ్లి కోసం సప్తగిరి చేసే ప్రయత్నాలు, ప్రతిసారీ ఏదో ఒక అవాంతరంతో అతని పెళ్లి అగిపోతుండటం వాణివి హ్యూమరస్‌గా చూపించారు. ట్రైలర్‌లో సప్తగిరి తన మార్క్ కామెడీతో అలరించాడు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
కాగా ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా.. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, మధు ఎడిటింగ్ అందిస్తున్నారు. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: