హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఇప్పటివరకు వదిలిన మూడు సాంగ్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్ ఫోటోగ్రఫీ అన్నీ అద్భుతంగా వుంటాయి. ఈ ఫార్మేట్‌లో ఇంతకంటే బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది.”
“వెంకి మంచి కమర్షియల్ ప్యాకెట్ సినిమా ఇస్తాడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మంచి యాక్షన్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కథ ఉన్న సినిమా ఇది. మంచి సక్సెస్ అవుతుందని అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నితిన్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన చాలా సపోర్ట్ చేశారు ఆయన సపోర్ట్ వల్లే సినిమా అద్భుతంగా వచ్చింది. నితిన్ శ్రీలల కాంబినేషన్ స్క్రీన్‌పై ముచ్చటగా ఉంటుంది.”
“రాజేంద్రప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా చాలా హిలేరియస్‌గా ఉంటుంది. ఈ సినిమా మాకు చేసినందుకు ఆయనకి చాలా థాంక్స్. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇరగదీసారు. మార్చి 28న ఆడియన్స్ చూడబోతున్నారు. వెంకీ తీసిన ‘ఛలో, భీష్మ’ పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా అంతకుమించి సక్సెస్ కాబోతుంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరిస్తుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: