వేట్టయన్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో రానున్నాడు.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర , శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.ఇక ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసే యోచన లో వున్నారు మేకర్స్.అన్ని కుదిరితే లోకేష్ బర్త్ డే మార్చి 14న ఈసినిమా టీజర్ వచ్చే ఛాన్స్ వుంది.లేదంటే మరో అప్డేట్ ఏదైనా ఇవ్వాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈసినిమాకు వున్న హైప్ దృష్ట్యా తెలుగు రైట్స్ కు నిర్మాత భారీ ధర చెప్తున్నారట.లోకేష్ చివరి రెండు సినిమాలు విక్రమ్, లియో తెలుగులోకూడా భారీ లాభాలను తీసుకొచ్చాయి. దాంతో కూలీ రైట్స్ కి ఫుల్ డిమాండ్ వుంది.
ఇక ఇదిలావుంటే రజినీ నెక్స్ట్ మూవీ జైలర్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.రెండేళ్ల క్రితం వచ్చిన జైలర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.నెల్సన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: