
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 40


తండేల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

రికార్డు సృష్టించిన పుష్ప 2

మహేష్ పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి

మాస్ జాతర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్

అఖండ 2 హీరోయిన్ రివీల్

తండేల్ పాటలన్నీ చార్ట్ బస్టర్స్

జాట్ రిలీజ్ డేట్ లాక్

మాస్ జాతర గ్లింప్స్ రానుంది

తండేల్ థర్డ్ సింగిల్ రిలీజ్

హిందీలో రిలీజ్ కానున్న డాకు మహారాజ్

శివ కార్తికేయన్ 25వ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

విశాల్ మదగజరాజ తెలుగులోకి

పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం - అనుపమ

మాస్ జాతర నుండి అప్డేట్ రానుంది

అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్ రిలీజ్

అదిరిపోయిన 'మాస్ జాతర' గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

తండేల్ ట్రైలర్ డేట్ ఫిక్స్
ఫిబ్రవరి లో మంచి హైప్ తో ఫస్ట్ వస్తున్న సినిమా తండేల్.ఈ సినిమానుండి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అందరి చూపు ట్రైలర్ పై పడింది. ఇక ఈ ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ట్రైలర్ కూడా క్లిక్ అయితే నాగ చైతన్య కెరీర్ లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ చేశారు.

రికార్డు సృష్టించిన పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ...51 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రీసెంట్ గా 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.ఇక ఈసినిమా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.

మహేష్ పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు - అగ్ర దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఏడాది నుండి ఈసినిమాకు సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే నిన్న రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వేసి సినిమా గురించి హింట్ ఇచ్చాడు.నిన్న తన ఇంస్టా లో ఓ వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి.అందులో రాజమౌళి సింహంను బందిస్తున్నట్లు అలాగే చేతిలో పాస్ పోర్ట్ తో నవ్వుతూ కనిపించారు.

మాస్ జాతర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్
మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ రాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా ట్యాగ్ లైన్.రవితేజకు ఇది 75వ సినిమా.భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ ఆర్ పి ఎఫ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇంతకుముందు రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు దాదాపుగా అన్ని సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ఈమాస్ జాతర పై మంచి అంచనాలు వున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం యూఎస్ఏ కలెక్షన్స్
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది సంక్రాంతికి వస్తున్నాం.రెండో వారం లో కూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నార్త్ అమెరికా లో నిన్నటి వరకు 2.5మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 3 మిలియన్ క్లబ్ లో చేరనుంది. ఓవరాల్ గా 11 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా 240కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను చేరుకుంటుందో చూడాలి.

దేవర ఓటిటి రెస్పాన్స్ అదిరింది
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర.అంతేకాదు ఆ ఏడాది తెలుగులో పుష్ప 2, కల్కి తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.ఈసినిమా నవంబర్ 8న ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా తరువాత హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇక ఓటిటి లో రిలీజై 10 వారాలకు పైగా అవుతున్న ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో దేవర ప్రస్తుతం 9వ స్థానం లో వుంది.ఓవరాల్ గా థియేటర్లలో సాలిడ్…

అఖండ 2 హీరోయిన్ రివీల్
మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేశారు.సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది.ఈరోజు సంయుక్త షూటింగ్ లో జాయిన్ అయ్యింది.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

తండేల్ పాటలన్నీ చార్ట్ బస్టర్స్
సంక్రాంతికి వస్తున్నాం విజయంలో సాంగ్స్ ఎలాంటి రోల్ ప్లే చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సినిమా విడుదలకు ముందు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యి ఫుల్ గా ప్రమోషన్స్ చేసి పెట్టాయి. ఫస్ట్ సాంగ్ గా వచ్చిన గోదారి గట్టు రీల్స్ లో బాగా ట్రెండ్ కావడం, ఫ్యామిలీస్ ఈ సాంగ్ ను చాలా బాగా రిసీవ్ చేసుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది.ఇక ఆతరువాత వచ్చిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.దాంతో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

దళపతి 69 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ కానున్నాడు.దాంతో విజయ్ ఈసినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.అందుకు తగ్గట్లే షూటింగ్ కూడా ఫాస్ట్ జరుగుతుంది.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.మార్చి లోపు బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.ఇక ఈసినిమానుండి ఈనెల 26న అప్డేట్ రానుంది.మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.అయితే ఈ అప్డేట్ గురించి మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి వుంది.

జాట్ రిలీజ్ డేట్ లాక్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ,టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో రణదీప్ హుడా, రెజీనా కాసాండ్రా ,సయామి ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఏప్రిల్ 10న జాట్ తెలుగు తోపాటు హిందీ ,తమిళ భాషల్లో విడుదలకానుంది.ఈ సందర్బంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇందులో సన్నీ డియోల్ యంగ్ గా కనిపించాడు.

మాస్ జాతర గ్లింప్స్ రానుంది
మాస్ మహారాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజ కు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్.ఇక ఈసినిమా నుండి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.

తండేల్ థర్డ్ సింగిల్ రిలీజ్
నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.హిట్ టాక్ వస్తే చైతు కెరీర్ లో మొదటి 100కోట్ల సినిమా కానుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.మెలోడీ గా హైలెస్సో హైలెస్సా అంటూ వచ్చిన ఈపాట కూడా పక్కా చార్ట్ బస్టర్ కానుంది.ఈ సాంగ్ కి శ్రేయ ఘోషల్ ,ఆకాష్ నజిజ్ వోకల్స్ అందించగా శ్రీమణి రచించాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఓవరాల్ గా సాంగ్ మాత్రం రిపీట్ లో వినేలా వుంది.

హిందీలో రిలీజ్ కానున్న డాకు మహారాజ్
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఈనెల 12న విడుదలైన సినిమా డాకు మహారాజ్.ఈసినిమా అంచనాలను అందుకొని సూపర్ వసూళ్లతో హిట్ దిశగా దూసుకెళ్తుంది.11 రోజుల్లో ఈ సినిమా దాదాపు 165 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఇక ఈసినిమాను హిందీలో కూడా విడుదలచేస్తున్నారు. అందులో భాగంగా నిన్న హిందీ ట్రైలర్ ను విడుదలచేశారు. రేపు ఈసినిమా హిందీలో రిలీజ్ కానుంది.మరి తెలుగులో అదరగొడుతున్న ఈసినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంక్రాంతికి వస్తున్నాం 9 డేస్ కలెక్షన్స్
రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ హవా కొనసాగిస్తోంది.ఇప్పటికే ఈసినిమా 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండడం తో 9రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 230కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో ఇదే మొదటి 200కోట్ల సినిమా.ఇక ఈసినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే వుంది.మిగితా సినిమాల నుండి పోటీ లేకపోవడం అలాగే తండేల్ వచ్చే వరకు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

శివ కార్తికేయన్ 25వ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
గత ఏడాది దీపావళికి అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు 40కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు.

విశాల్ మదగజరాజ తెలుగులోకి
హీరో విశాల్ నటించిన మదగజరాజ ఈ పొంగల్ కు వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకోగా విడుదలకు మాత్రం బ్రేక్ పడుతూ వచ్చింది. ఇక 12 ఏళ్ళ తరువాత ఎట్టకేలకు ఈ పొంగల్ కు విడుదలై 50 కోట్లకు పైగా వసూలు చేసి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ఈసినిమాలో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టగా సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం - అనుపమ
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మాస్ జాతర నుండి అప్డేట్ రానుంది
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వస్తుంది మాస్ జాతర.అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇంతకుముందు భాను బ్లాక్ బాస్టర్ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేశాడు.ఇక ఇప్పుడు మాస్ జాతర తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఖాకి సినిమా తరహాలో తెరకెక్కుతుంది ఈసినిమా.

అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్ రిలీజ్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు 'పరదా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి సంగీత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.