మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్లింప్స్ ఆద్యంతం యాక్షన్ ఘట్టాలతో ఆకట్టుకుంది. ‘మనదే ఇదంతా..’ అంటూ రవితేజ తన స్టైల్ లో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. మరోసారి రవితేజ తన గ్రేస్ చూపించాడు. ఆయన స్వాగ్, బాడీ లాంగ్వేజ్ మెస్మరైజ్ చేసేలావుంది. మొత్తానికి రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో సాగిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
కాగా ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో మరియు విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేయబోతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: