హీరో విశాల్ నటించిన మదగజరాజ ఈ పొంగల్ కు వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకోగా విడుదలకు మాత్రం బ్రేక్ పడుతూ వచ్చింది. ఇక 12 ఏళ్ళ తరువాత ఎట్టకేలకు ఈ పొంగల్ కు విడుదలై 50 కోట్లకు పైగా వసూలు చేసి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ఈసినిమాలో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టగా సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నారు. మరి తెలుగులో మదగజరాజ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇందులో వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.విజయ్ ఆంటోనీ ఈసినిమాకు సంగీతం అందించగా జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించింది.
ఇక విశాల్ గత ఏడాది రత్నంతో రాగ మిశ్రమ స్పందన వచ్చింది. హరి ఈసినిమా ను తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ప్రస్తుతం విశాల్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అందులో తుప్పరివాలన్ 2 ఒకటి. సూపర్ హిట్ మూవీ తుప్పరివాలన్ కు సీక్వెల్ గా రానుంది. తెలుగులో ఈసినిమా డిటెక్టివ్ గా విడుదలై ఇక్కడ కూడా హిట్ అయ్యింది. దాంతో తుప్పరివాలన్ 2 పై మంచి అంచనాలు వున్నాయి. ఈసినిమాను విశాలే డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ గా తనకు ఇదే మొదటి సినిమా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: