మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వస్తుంది మాస్ జాతర.అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇంతకుముందు భాను బ్లాక్ బాస్టర్ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేశాడు.ఇక ఇప్పుడు మాస్ జాతర తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఖాకి సినిమా తరహాలో తెరకెక్కుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటివరకు ఓ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు.అయితే రవితేజ బర్త్ డే జనవరి 26న టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక రవితేజ చివరి నాలుగు సినిమాలు నిరాశ పరిచాయి.దాంతో మాస్ జాతర విజయం రవితేజకు తప్పనిసరి కానుంది. ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.మరి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గా వస్తున్న మాస్ జాతరతో రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























