
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 41


డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్

లైలా సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' వస్తోంది

తండేల్ థర్డ్ సింగిల్ 'హైలెస్సో హైలెస్సా' వస్తోంది

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్

గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్

తమ్ముడు.. లేటెస్ట్ అప్డేట్

భైరవం టీజర్ రిలీజ్

6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డ్

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు విజయ రంగరాజు మృతి

తండేల్ ట్రైలర్ రానుంది

సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు దాటుతుందని..

వరుణ్ తేజ్ #VT15 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

200 కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వారం రోజుల్లోనే 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.రీజినల్ మూవీ గా వచ్చి అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇక వీక్ డేస్ లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో నిలిచి డామినేషన్ కొనసాగిస్తోంది.

డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్
బాలకృష్ణ డాకు మహారాజ్ 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసి బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా 200కోట్ల షేర్ మార్క్‌ను దాటింది.

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుంది - హాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుందని, తనతో ఒక సినిమా చేయాలనుందని మనసులో మాట వెలిబుచ్చారు 'సూపర్ మేన్' సినిమా ఫేమ్, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో జూనియర్ నటనకు ముగ్ధుడనయ్యానని, అప్పుడే ఆయనతో ఓ సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు జేమ్స్ తెలిపారు.

నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'కృష్ణ వింద విహారి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. దీని తర్వాత ఎన్నో అసలు పెట్టుకున్న 'రంగబలి' బావుందని టాక్ తెచ్చుకుంది కానీ, సాలిడ్ వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు శౌర్య.

లైలా సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' వస్తోంది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'లైలా'. రీసెంట్‌గా రిలీజైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ 'అమ్మాయి- అబ్బాయి'గా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

తండేల్ థర్డ్ సింగిల్ 'హైలెస్సో హైలెస్సా' వస్తోంది
యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంగ్ రన్ లో అదరగొడుతుంది.50 రోజులకు చేరువైనా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక మూడు రోజుల క్రితం 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.నైజాంలో టికెట్ ధరలను తగ్గించడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది అయితే సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఆక్రమించుకోవడంతో పుష్ప 2ను లిమిటెడ్ స్క్రీన్ లలో ప్రదర్శిస్తున్నారు.

గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఐడెంటిటీ'. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.

తమ్ముడు.. లేటెస్ట్ అప్‌డేట్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది.

భైరవం టీజర్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డ్
సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఊహించని విధంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్న ఒక్క రోజే 14.4కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.దాంతో 6వ రోజు అత్యధిక షేర్ ను రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డు లు పడ్డాయి.ప్రపంచ వ్యాప్తంగా నిన్న 17కోట్ల షేర్ ను రాబట్టింది.అంతేకాదు 6రోజుల్లోనే 100కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది.

కన్నప్ప.. శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు విజయ రంగరాజు మృతి
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ట్రీట్మెంట్ కోసం విజయ రంగరాజు చెన్నై వెళ్లారు.

తండేల్ ట్రైలర్ రానుంది
సంక్రాంతికి సినిమాల తరువాత నెక్స్ట్ భారీ హైప్ తో వస్తున్న సినిమా తండేల్. నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.వాస్తవిక సంఘటనల ఆధారంగా దాదాపు 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రాగ ఆరెండూ చార్ట్ బస్టర్ అయ్యాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను వదిలాలని చూస్తున్నారు. కుదిరితే ఈ వారం లోనే రిలీజ్ చేయనునున్నారు.అలాగే ప్రమోషన్స్ కూడా భారీగా చేయనున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు దాటుతుందని..
''ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంతో మొదలౌతోంది. నా కెరీర్ లో బీజీయస్ట్ ఇయర్ 2025. ప్రపంచమంతటా తెలుగు సినిమా విజయ బావుటా ఎగురువేయడం గర్వకారణంగా వుంది. ఇలాంటి సినిమాలో నేను ఇంత బిజీగా ఉంటూ విభిన్న పాత్రలతో ఇటు థియేటర్ లో అటు ఓటీటీలో ప్రేక్షకులని అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు నవరసరాయ డా. నరేష్ విజయ్ కృష్ణ. జనవరి 20 ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు.

సంక్రాంతికి వస్తున్నాం.. నార్త్ అమెరికాలో సెన్సేషనల్ కలెక్షన్స్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని మొత్తం 100కోట్ల షేర్ మార్క్ ను దాటింది.

నాని-ప్రియదర్శి 'కోర్ట్' ఫస్ట్ లుక్ లాంచ్
వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ 'కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ'.

వరుణ్ తేజ్ #VT15 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు, ఈ సందర్భంగా, వరుణ్ తేజ్15వ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజైయింది. హ్యుమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ #VT15 చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.