నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.హిట్ టాక్ వస్తే చైతు కెరీర్ లో మొదటి 100కోట్ల సినిమా కానుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.మెలోడీ గా హైలెస్సో హైలెస్సా అంటూ వచ్చిన ఈపాట కూడా పక్కా చార్ట్ బస్టర్ కానుంది.ఈ సాంగ్ కి శ్రేయ ఘోషల్ ,ఆకాష్ నజిజ్ వోకల్స్ అందించగా శ్రీమణి రచించాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఓవరాల్ గా సాంగ్ మాత్రం రిపీట్ లో వినేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ అవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.ట్రైలర్ రావాల్సివుంది.వచ్చే వారంలో రిలీజ్ చేయనున్నారు.సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో తండేల్ టీం ప్రమోషన్స్ కూడా సార్ట్ చేసింది.అందులో భాగంగా ఈసినిమా డిఓపి శ్యామ్ దత్ వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు.త్వరలోనే మిగితా టీం కూడా ప్రమోషన్స్ లో పాల్గొననుంది.
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 7న తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు.సోలో గా రిలీజ్ కావడం తండేల్ కు కలిసి రానుంది.దాంతో చైతన్య కెరీర్ లోనే ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: