మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ రాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా ట్యాగ్ లైన్.రవితేజకు ఇది 75వ సినిమా.భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ ఆర్ పి ఎఫ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇంతకుముందు రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు దాదాపుగా అన్ని సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ఈమాస్ జాతర పై మంచి అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రవితేజ బర్త్ డే సందర్బంగా జనవరి 26న ఈ సినిమానుండి గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలిసిందే.తాజాగా గ్లింప్స్ రిలీజ్ టైం ను కూడా చెప్పేశారు మేకర్స్. రేపు ఉదయం 11:07గంటలకు ఈ గ్లింప్స్ బయటికి రానుంది.ఈసందర్భంగా ఆర్ పి ఎఫ్ లుక్ లో వున్న రవితేజ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇందులో రవితేజ యంగ్ గా కనిపించాడు.ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ కూడా ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు.ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా విజయం రవితేజకు తప్పనిసరి కానుంది.తన నుండి వచ్చిన చివరి సినిమాలు సరిగా వర్క్ అవుట్ కాలేదు.దాంతో ఈసారి ఎలాగైనా మాస్ జాతర తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.మే 9న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























