గత ఏడాది దీపావళికి అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు 40కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత శివ కార్తికేయన్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా సెట్స్ మీద వుండగానే మరో సినిమాను మొదలుపెడుతున్నాడు శివ కార్తికేయన్.
అందులో భాగంగా తన 25వ సినిమాను ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర తో చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.ఇందులో జయం రవి,అథర్వా, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇక ఈసినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాకు పరాశక్తి అనే టైటిల్ ను పెట్టారట. త్వరలోనే టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈఏడాది చివర్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: