సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది సంక్రాంతికి వస్తున్నాం.రెండో వారం లో కూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నార్త్ అమెరికా లో నిన్నటి వరకు 2.5మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 3 మిలియన్ క్లబ్ లో చేరనుంది. ఓవరాల్ గా 11 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా 240కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను చేరుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రేపు భీమవరంలోని ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపనున్నారు సంక్రాంతి వస్తున్నాం టీం.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమాతో వెంకటేష్ ,అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టారు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3సూపర్ హిట్ అవ్వగా సంక్రాంతికి వస్తున్నాం ఈరెండింటికి మించిన విజయం సాధించింది.అంతేకాదు వీరి కాంబినేషన్ లో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా రానుంది.అయితే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం పట్టనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: