సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఈనెల 12న విడుదలైన సినిమా డాకు మహారాజ్.ఈసినిమా అంచనాలను అందుకొని సూపర్ వసూళ్లతో హిట్ దిశగా దూసుకెళ్తుంది.11 రోజుల్లో ఈ సినిమా దాదాపు 165 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఇక ఈసినిమాను హిందీలో కూడా విడుదలచేస్తున్నారు. అందులో భాగంగా నిన్న హిందీ ట్రైలర్ ను విడుదలచేశారు. రేపు ఈసినిమా హిందీలో రిలీజ్ కానుంది.మరి తెలుగులో అదరగొడుతున్న ఈసినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న బాబీ తెరకెక్కించిన ఈసినిమాలో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరిశాడు.తమన్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 లో నటిస్తున్నాడు.అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. దసరాకు విడుదలకానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: