సంక్రాంతికి వస్తున్నాం విజయంలో సాంగ్స్ ఎలాంటి రోల్ ప్లే చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సినిమా విడుదలకు ముందు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యి ఫుల్ గా ప్రమోషన్స్ చేసి పెట్టాయి. ఫస్ట్ సాంగ్ గా వచ్చిన గోదారి గట్టు రీల్స్ లో బాగా ట్రెండ్ కావడం, ఫ్యామిలీస్ ఈ సాంగ్ ను చాలా బాగా రిసీవ్ చేసుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది.ఇక ఆతరువాత వచ్చిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.దాంతో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం బాటలోనే వెళ్తుంది నాగ చైతన్య తండేల్. ఈసినిమా నుండి వచ్చిన మొదటి పాట బుజ్జి తల్లి ఇప్పటివరకు యూట్యూబ్ లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.సెకండ్ సాంగ్ డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక నిన్న విడుదలైన మూడో సాంగ్ హైలెస్సో హైలెస్సా అయితే యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈమెలోడీ సాంగ్ కు యూట్యూబ్ లో ఇప్పటివరకు కోటి వ్యూస్ దాటాయి.ఇలా సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సగం ప్రమోషన్స్ చేసిపెట్టాయి.ట్రైలర్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే చైతన్య కెరీర్ లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
చైతన్య,సాయి పల్లవి స్టార్ పవర్ కి తోడు సాంగ్స్ అన్ని హిట్ కావడంతో రిలీజ్ ముందు తండేల్ కు అడ్వాంటేజ్ అయ్యింది.సినిమాకు కూడా హిట్ టాక్ వస్తే చైతన్య 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.చందు మొండేటి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.వచ్చే నెల 7న తండేల్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: