తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ కానున్నాడు.దాంతో విజయ్ ఈసినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.అందుకు తగ్గట్లే షూటింగ్ కూడా ఫాస్ట్ జరుగుతుంది.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.మార్చి లోపు బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.ఇక ఈసినిమానుండి ఈనెల 26న అప్డేట్ రానుంది.మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.అయితే ఈ అప్డేట్ గురించి మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్షన్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈసినిమా అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.
ఇక గత ఏడాది విజయ్ ,ది గోట్ తో ప్రేక్షకులముందుకు రాగ డివైడ్ టాక్ తోనే దాదాపు 400కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ అవ్వగా ఇక్కడ పూర్తిగా నిరాశపరిచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: