గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర.అంతేకాదు ఆ ఏడాది తెలుగులో పుష్ప 2, కల్కి తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.ఈసినిమా నవంబర్ 8న ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా తరువాత హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇక ఓటిటి లో రిలీజై 10 వారాలకు పైగా అవుతున్న ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో దేవర ప్రస్తుతం 9వ స్థానం లో వుంది.ఓవరాల్ గా థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటి లో కూడా అదరగొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.అనిరుధ్ సంగీతం సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.ఇక దేవర 2 కూడా రానుంది.అయితే ఇప్పుడప్పుడే ఈసినిమా స్టార్ట్ అయ్యేలా లేదు.
ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్, వార్ 2 లో నటిస్తున్నాడు.అయాన్ ముఖర్జీ ఈసినిమా తెరకెక్కిస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఆగస్టు 15న విడుదలచేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కానుంది.వచ్చే ఏడాది లో విడుదలకానుంది.ఈ సినిమాను పూర్తి చేసి కానీ ఎన్టీఆర్, దేవర 2 మొదలుపెట్టడు. సో వచ్చే ఏడాదిలోనే దేవర సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























