కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 265

Kajal Aggarwal Reveals Interesting Facts About Nandamuri Balakrishna's Bhagavanth Kesari
సినిమా వార్తలు

భగవంత్ కేసరి చేయడానికి కారణం అదే - కాజల్ అగర్వాల్

‘భగవంత్’ కేసరి లాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుందని, ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రీలీల మరో కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే విడుదలైన ఈ…

Srikanth Mవాట్సాప్
vennela kishore look released from What The Fish Movie
ఫస్ట్ లుక్

వాట్ ద ఫిష్- వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్

మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
69th National Film Awards Allu Arjun Received Best Actor Award From President Droupadi Murmu
సినిమా వార్తలు

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 17, 2023) అందజేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో తన అత్యుత్తమ నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే 'పుష్ప' సినిమాకు అందించిన అద్భుతమైన సంగీతానికిగానూ…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari run time revealed
సినిమా వార్తలు

భగవంత్ కేసరి రన్ టైం రివీల్

మచ్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి మరో రెండు రోజుల్లో థియేటర్లర్లోకి రానుంది.ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.బాలకృష్ణ ను ఈసినిమాలో సరికొత్త గా చూపించనున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈసినిమాకు రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే వుంది.164 నిమిషాల రన్ టైంతో ఈసినిమా రానుంది.

Mahender Reddyవాట్సాప్
bhagavanth kesari movie interesting elements
సినిమా వార్తలు

భగవంత్ కేసరి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఆక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
leo movie usa pre sales update
సినిమా వార్తలు

1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్

రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. ఈసినిమా రిలీజ్ కు ముందే సూపర్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఈసినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా విజయ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందరి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది.

TFN Adminవాట్సాప్
Karthi's Japan Movie Teaser to be Out in Soon
ట్రైలర్ & టీజర్

అతి త్వరలో రిలీజ్ కానున్న కార్తీ 'జపాన్' మూవీ టీజర్

తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న తమిళ హీరోలలో ప్రముఖ నటుడు కార్తీ ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచే తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఆయన తన సినిమాలను రిలీజ్‌ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాకుండా కార్తీ సినిమా ప్రమోషన్స్ సమయంలో తెలుగులో మాట్లాడటం, అలాగే సినిమాల్లో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆయన సినిమాల‌కు ఇక్కడ మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి.

Srikanth Mవాట్సాప్
Ajay Bhupathi's Mangalavaaram Trailer Launch Date Fixed
ట్రైలర్ & టీజర్

మంగళవారం ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అందునా ముఖ్యంగా నూతన నటీనటులను ప్రధానపాత్రధారులుగా పరిచయం చేస్తూ తీయడం ఆయన గట్స్‌కి నిదర్శనం. 'ఆర్ఎక్స్ 100' తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా 'మహాసముద్రం' అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. దీనికి ఆయన సినిమాను డైరెక్ట్ చేసే విధానమే కారణం.

Srikanth Mవాట్సాప్
two noted banners acquired hi nanna movie USA rights
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థలకు హాయ్ నాన్న యూఎస్ఏ రైట్స్

దసరా సినిమా తరువాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్నసినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈసినిమాను డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా ఇప్పటినుండే మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. సమయమా అనే పాటను అలానే గాజు బొమ్మ అనే పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Senior Hero Rajasekhar Joins In Extra Ordinary Man Shooting
షూటింగ్ అప్‌డేట్

నితిన్ సినిమాలో రాజశేఖర్

యంగ్ హీరో నితిన్,డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.ప్రస్తుతం షూటింగ్ లో వున్న ఈసినిమా ఈ డిసెంబర్ 8న విడుదలకానుంది. ఈసినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమానుండి సప్రైజ్ అప్డేట్ వచ్చింది.ఈసినిమాలో సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈరోజే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.అందుకు సంబంధించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi's Shankar Dada MBBS Ready For Re Release
రిలీజ్ అప్‌డేట్

రీ రిలీజ్‌కు సిద్దమైన శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

టాలీవుడ్లో గత కొన్ని నెలలుగా రీ-రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోల ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం ద్వారా మంచి లాభాలను కళ్లజూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజై ఘనవిజయం సాధించాయి. ఇక ఇటీవలే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా రీ రిలీజై ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చిత్రం కూడా చేరిపోయింది.

Srikanth Mవాట్సాప్
Two Star Directors Joins In Vishals 34 Movie
సినిమా వార్తలు

విశాల్ 34 లో స్టార్ డైరెక్టర్స్

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు విశాల్. స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ తో తమిళనాడులోని తొట్టికూడులో ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని సెట్ లో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కమ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ ఎవరో…

TFN Adminవాట్సాప్
Venkatesh Interesting Comments On Guntur Kaaram Release
సినిమా వార్తలు

గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంపై రోజు రోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈమధ్య ఎక్కడ చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. రీసెంట్ గా మ్యాడ్ ఈవెంట్ లో పాల్గొన్న సిద్దు ఈసినిమా గురించి అప్ డేట్ ఇస్తూ హైప్ ఇచ్చాడు. ఇప్పుడు వెంకీ కూడా ఈసినిమా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Salman Khan's Tiger 3 Movie Telugu Trailer Out
ట్రైలర్ & టీజర్

టైగర్ 3 తెలుగు ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సల్మాన్‌ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టైగర్‌ 3’. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ మరో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా ఈ 'టైగర్ 3' చిత్రం బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 'స్పై యూనివర్స్' నుంచి వస్తున్న నాలుగో సినిమా కావడం గమనార్హం. ఇంతకుముందు ఇదే తరహా కథాంశంతో 2017లో వచ్చిన టైగర్ జిందా హై, వార్ (2019), పఠాన్ (2023) చిత్రాలు వచ్చాయి. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మనీశ్‌ శర్మ…

Srikanth Mవాట్సాప్
VI Anand Clartity About Ooru Peru Bhairavakona Movie
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవ కోన- విరూపాక్షవేరు ఈసినిమా వేరు

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా మొత్తం గరుడపురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడపురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
salaar team birthday wishes to Prithviraj Sukumaran
సినిమా వార్తలు

వరద రాజా కు సలార్ టీమ్ బర్త్ డే విషెస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుటుంది. అయితే ఈసినిమా రిలీజ్ కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Interesting Comments on Actress Sreeleela
సినిమా వార్తలు

భగవంత్ కేసరిలో మా మధ్య కెమిస్ట్రీ అద్భుతం - నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్ అని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా చేస్తుండటం విశేషం. కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి…

Srikanth Mవాట్సాప్
Siddhu Jonnalagadda New Movie Title Revealed
సినిమా వార్తలు

తెలుసు కదా అంటున్న సిద్దు జొన్నలగడ్డ

ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా మరో సినిమా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Malavika Nair's First Look Poster Out From Devil
ఫస్ట్ లుక్

డెవిల్ నుంచి మాళ‌వికా నాయ‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ప్రధాన పాత్రలో మాళ‌వికా నాయ‌ర్ కనిపించనుంది. కాగా ‘డెవిల్’ సినిమాను న‌వంబ‌ర్ త్వరలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda's VD13 Title Will be Announced on October 18
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నూతన చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతోంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్