సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు విశాల్. స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ తో తమిళనాడులోని తొట్టికూడులో ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని సెట్ లో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కమ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు గౌతమ్ మీనన్ ఇంకా సముద్రఖని. ఇక వీరితో దిగిన ఫొటోను విశాల్ పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: