సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంపై రోజు రోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈమధ్య ఎక్కడ చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. రీసెంట్ గా మ్యాడ్ ఈవెంట్ లో పాల్గొన్న సిద్దు ఈసినిమా గురించి అప్ డేట్ ఇస్తూ హైప్ ఇచ్చాడు. ఇప్పుడు వెంకీ కూడా ఈసినిమా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి ఇప్పటికే గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకీ ని గుంటూరు కారం పండక్కి వస్తుంది.. మీ సినిమా వస్తుంది.. పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ కలిసి వస్తున్నారు..రిజల్ట్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు అన అడుగగా.. పెద్దోడు వచ్చినా సూపర్ హిట్, చిన్నోడు వచ్చినా సూపర్ హిట్. పెద్దోడు సినిమా కోసం అలానే చిన్నోడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. పండక్కి ఇద్దరం రావడం చాలా ఆనందంగా ఉంది.. ప్రేక్షకులు ఖచ్చితంగా ఇద్దరి సినిమాలు చూడటానికి వస్తారు అంటూ తెలిపారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: