దసరా సినిమా తరువాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్నసినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈసినిమాను డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా ఇప్పటినుండే మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. సమయమా అనే పాటను అలానే గాజు బొమ్మ అనే పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Proud to reunite with our first star @NameIsNani after the tremendous success of Dasara 🔥
The grand USA distribution rights of #HiNanna #HiPapa have been acquired by @PrathyangiraUS and @AACreationsUS 🤩
This time, it’s going to be even more MASSIVE ❤️@VyraEnts @mrunal0801… pic.twitter.com/FIVQ2EVbvT
— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 16, 2023
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా యూఎస్ఏ హక్కులను రెండు ప్రముఖ సంస్థలు సొంతం చేసుకున్నట్టు తెలిపారు. ప్రత్యంగిర సినిమాస్ ఇంకా ఏఏ క్రియేషన్స్ యూఎస్ సంస్థలవారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































