యంగ్ హీరో నితిన్,డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.ప్రస్తుతం షూటింగ్ లో వున్న ఈసినిమా ఈ డిసెంబర్ 8న విడుదలకానుంది. ఈసినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమానుండి సప్రైజ్ అప్డేట్ వచ్చింది.ఈసినిమాలో సీనియర్ హీరో,యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈరోజే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.అందుకు సంబంధించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcoming the Most Celebrated ANGRY MAN Dr.Rajashekar sir on the sets of our #Extraordinaryman 💐 I’m sure you’re going to stun everyone again Angry Man 🤗🤗
#Ext#ExtraordinarymanOnDEC8th pic.twitter.com/sHdV1HT55O— nithiin (@actor_nithiin) October 16, 2023
ఇదిలావుంటే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వున్న రాజశేఖర్ ఇప్పుడు విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. మరి ఈ సినిమా రాజశేఖర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.ఇంతకుముందు హీరోగా చేసిన తరువాత జగపతి బాబు కూడా కొంత కాలం బ్రేక్ తీసుకొని విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక అక్కడి నుండి అయన వెనుదిగిరి చూసుకోలేదు.మరి రాజశేఖర్ కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈసినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమా నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: