తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న తమిళ హీరోలలో ప్రముఖ నటుడు కార్తీ ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచే తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఆయన తన సినిమాలను రిలీజ్ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాకుండా కార్తీ సినిమా ప్రమోషన్స్ సమయంలో తెలుగులో మాట్లాడటం, అలాగే సినిమాల్లో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ.. ప్రస్తుతం ‘జపాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘జోకర్’ మూవీ ఫేమ్ రాజు మురుగున్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. అయితే కార్తీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతుందని రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తోనే అర్థమైపోయింది. అలాగే కార్తీ గెటప్, మేకోవర్ ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
#Karthi‘s power packed #JapanTeaser is on the way!! 🔥#Japan from Diwali 🧨@Karthi_Offl @ItsAnuEmmanuel @gvprakash @Dir_Rajumurugan @JapanTheMovie @DreamWarriorpic #Karthi25 #JapanDiwali #TeluguFilmNagar pic.twitter.com/rN6scuAhvX
— Telugu FilmNagar (@telugufilmnagar) October 17, 2023
ఇక ‘జపాన్’ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ తొలిసారి హీరోయిన్‌గా చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ‘మా నగరం’, ‘ఖైదీ’, ‘తానక్కరన్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కాగా ‘జపాన్’ సినిమాను దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: