
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 198


విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం

నెట్ ఫ్లిక్స్ చేతికి విజయ్ ది గోట్

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

'గామి'.. థియేటర్స్‌లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది - సందీప్ రెడ్డి వంగా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీతో విశ్వక్ సేన్ పక్కాగా హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి.

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా
కోలీవుడ్ లో ప్రస్తుతం ఓ మలయాళ సినిమా డామినేషన్ కొనసాగుతుంది.గత వారం మంజిమ్మల్ బాయ్స్ అనే సినిమా విడుదలైయింది.చిన్న సినిమా గా వచ్చిన ఈసినిమా అదిరిపోయే టాక్ తో ఇప్పటివరకు 2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం కల్లా మరో రెండు కోట్లను ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాంతో తమిళనాడులో బిగ్గెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 10కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.పైగా అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకావడం లేదు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగులో బిజీ అవుతున్న బిగ్ బాస్ 17 ఫేమ్ అయేషా ఖాన్
బిగ్ బాస్ 17ఫేమ్ అయేషా ఖాన్ తెలుగులో బిజీ అవుతుంది.ముఖచిత్రం అనే సినిమాతో తెలుగులోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చినా ఈసినిమా తనకు కావాల్సిన గుర్తింపు ను తీసుకురాలేకపోయింది.దాంతో ఆఫర్లు లేక గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇటీవల బిగ్ బాస్ 17 పుణ్యమా అని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.అందులో భాగంగా శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ లో అయేషా ఓ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా మార్చి 22న విడుదలవుతుంది.హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి ఈసినిమాను తెరకెక్కించగా యూవీ సెల్యులాయిడ్ నిర్మిస్తుంది.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా-రణ్‌వీర్ జంట
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా దీపిక పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రెగ్నెంట్' అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అందులో వెల్లడించారు.

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం
మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రేపు రానుంది.ఈసినిమాకు బజ్ కూడా బాగానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో రానుంది.యు/ఏ సర్టిఫికెట్ తో కేవలం 2గంటల నిడివి తో థియేటర్లలోకి రానుంది.పుల్వామా ఘటనకు ఏవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథతో తెరకెక్కింది ఈసినిమా.మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ నిర్మించింది.

నెట్ ఫ్లిక్స్ చేతికి విజయ్ ది గోట్
లియోతో గత ఏడాది కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)లో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడిన మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. దానిపై ఇప్పటికే వరుణ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఇంకా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా నాగబాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సారీ చెప్పారు. ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను…

ఆపరేషన్ వాలెంటైన్ నుండి ప్రభవించే సాంగ్ రిలీజ్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభవించే అంటూ వచ్చే నాలుగో పాటను రిలీజ్ చేశారు.

శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాజమౌళి దంపతులు
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలతో ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం 'ఆర్ ఆర్ఆర్' అయితే అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కనుంది.

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇక గత ఏడాది సామజవరగమన అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈగల్ అమెజాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది.

వెబ్‌సిరీస్‌గా మాజీ ప్రధాని పీవీ జీవిత చరిత్ర
భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రధానిగా ఉన్న 1991 నుంచి 1996 మధ్య కాలంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలను ఎంతో సాహసోపేతంగా అమలుచేసి దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించిన వైనం అనన్యసామాన్యం. కాలక్రమంలో ఆ సంస్కరణల ఫలాలు దేశ స్థితిగతులనే మార్చేశాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.

ప్రముఖ సంస్థలకు సిద్దూ జాక్ నార్త్ అమెరికా హక్కులు
గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి…

50కోట్ల క్లబ్ లో చేరనున్న ఆర్టికల్ 370
ఆర్టికల్ 370 హిందీలో అదరగొడుతుంది.వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగింస్తూ 50కోట్లలో చేరడానికి రెడీ గా వుంది.దేశ వ్యాప్తంగా సోమవారం 3.60కోట్లు,మంగళవారం 3.55కోట్లు రాబట్టింది.దాంతో 5రోజుల్లో 32.60కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 44.60కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ వుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా జోరుగా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. సెన్సార్ సభ్యల నుండి ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు…

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు హర్ష కనుగొంటి దర్శకత్వంలో ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
గత వారం అన్ని చిన్న సినిమాలే విడుదలకాగా ఇందులో ఏఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేయలేకపోయింది.ఇక ఈవారం ఓ మీడియం బడ్జెట్ మూవీ విడుదలవుతుంది అదే ఆపరేషన్ వాలంటైన్.ఈసినిమాకు హైప్ కూడా బాగానే వుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈసినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక ఈసినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.