వెబ్‌సిరీస్‌గా మాజీ ప్రధాని పీవీ జీవిత చరిత్ర

Bharat Ratna PV Narasimha Rao's Biopic Half Lion Coming on Aha Soon

భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రధానిగా ఉన్న 1991 నుంచి 1996 మధ్య కాలంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలను ఎంతో సాహసోపేతంగా అమలుచేసి దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించిన వైనం అనన్యసామాన్యం. కాలక్రమంలో ఆ సంస్కరణల ఫలాలు దేశ స్థితిగతులనే మార్చేశాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పీవీ నరసింహారావు జీవిత చరిత్రను వెబ్‌సిరీస్‌ రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా స్టూడియో మరియు అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా పీవీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇటీవల పీవీకి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత కసరత్తులు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక దీనికి ‘హాఫ్‌ లయన్‌’ అనే టైటిల్ నిర్ణయించినట్లు తాజాగా ‘ఆహా’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

కాగా వెబ్‌సిరీస్‌ను ప్రముఖ రచయిత వినయ్‌ సీతాపతి రచించిన ‘హాఫ్‌ లయన్‌’ పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్నారు. సీనియర్‌ దర్శకుడు ప్రకాష్‌ ఝా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌ ద్వారా పీవీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలను చూపించనున్నారు. ఇదిలాఉండగా ఈ సిరీస్‌కు సంబంధించి స్ట్రీమింగ్ డేట్‍ మరియు ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =