శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sree Vishnu New Movie Title Release Date

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు
హర్ష కనుగొంటి దర్శకత్వంలో ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను ఫిబ్రవరి 29న ఉదయం 11 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. చాలా డిఫరెంట్ పోస్టర్ తో ప్రకటించారు. అయితే వీరి కాంబినేషన్ నుంచి రాజ రాజ చోర నేపథ్యంలోనే ప్రీక్వెల్ ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =