
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 196


సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గామి

బలగం 1 ఇయర్ సెలబ్రేషన్స్

కన్నప్ప కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్

ట్రెండింగ్ లో సలార్ హిందీ వెర్షన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

అభిమానులకు సూర్య స్పెషల్ విందు.. ఫొటోలు వైరల్

తలైవా వెట్టైయాన్ సెట్ లో రానా

మరో మలయాళీ బ్లాక్ బాస్టర్ తెలుగులోకి

గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న ఆయ్

సలార్ 2 పై బాబి సింహా ఇంట్రస్టింగ్ అప్ డేట్

ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రేమలు తెలుగు ట్రైలర్ రిలీజ్

నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్

ఫ్యామిలీ స్టార్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
గీత గోవిందం తరువాత డైరెక్టర్ పరుశురాం,సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఇందులో విజయ్ మిడికల్ క్లాస్ కుర్రాడి గా కనిపించనున్నాడు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను వదిలారు.టీజర్ చూస్తే టైటిల్ కు తగ్గట్లే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.చివర్లో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ,విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సన్నివేశం టీజర్ కు హైలైట్ అయ్యింది.ఓవరాల్ గా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో ఈ టీజర్ ఇప్పటివరకు 7మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా విజయ్ కి మరో గీత గోవిందం కానుంది.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గామి
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్,ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బలగం 1 ఇయర్ సెలబ్రేషన్స్
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది బలగం. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది. ఇక ఈసినిమా అంతర్జాతీయంగా కూడా తన సత్తాను చాటింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఏడాదిని పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ అంతా కలిసి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు.

నా కెరీర్‌ను మలుపు తిప్పినవి ఆ మూడు సినిమాలే - మహేష్ బాబు
తన కెరీర్‌ను మలుపు తిప్పినవాటిలో మూడు సినిమాలు ఉన్నాయని, అవి తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన తన సినిమా కెరీర్, ఫ్యామిలీ విషయాలు, రాజమౌళితో చేయబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సహా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా చిత్రం గుంటూరు కారం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.

కన్నప్ప కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్
చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్
రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది.

ట్రెండింగ్ లో సలార్ హిందీ వెర్షన్
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హిందీ వెర్షన్ కూడా ఓటిటి లో అదరగొడుతుంది.గత నెల 16న సలార్ హిందీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాగ ఇప్పటికీ మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక తెలుగు తోపాటు మిగితా వెర్షన్ లు నెట్ ఫ్లిక్స్ లో జనవరి లోనే విడుదలకాగా తెలుగు వెర్షన్ టాప్ 10 టెన్ ఇండియన్ మూవీస్ లో 10వస్థానంలో కొనసాగుతుంది.

గామి ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

ఈవారం బాక్సాఫీస్ క్లాష్ మాములు గా లేదు
గత వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది మరి కొన్ని రీ రిలీజ్ లు కూడా అయ్యాయి.అయితే ఈవారం మాత్రం మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.ఈమూడు సినిమాలకు మంచి హైప్ వుంది.దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.ఇందులో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ సినిమా.ఇంతకీ అవేంటంటే గోపిచంద్ భీమా,విశ్వక్ సేన్ గామి అలాగే ప్రేమలు అనే డబ్బింగ్ సినిమా ఈ శివరాత్రికి విడుదలకానున్నాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత సోమవారం తిరుపతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ముందుగా తిరుమల కొండకు చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సమంతకు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

స్పిరిట్ ఆఫ్ గామి- శివమ్ ఫుల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మార్చి 8వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

అభిమానులకు సూర్య స్పెషల్ విందు.. ఫొటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో కూడా భారీగానే అభిమానులున్నారు. సినిమాలపరంగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా సూర్య తన అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది సంభవించిన మిగ్‌జాం తుపాను కారణంగా తమిళనాడు అతలాకుతలమైన విషయం గుర్తుండే ఉంటుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై సహా అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలుచోట్ల ఇళ్ళు మునిగిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

తలైవా వెట్టైయాన్ సెట్ లో రానా
జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమాా టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెట్టైయాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఖరారు చేశారు.

మరో మలయాళీ బ్లాక్ బాస్టర్ తెలుగులోకి
గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి ప్రేమలు, భ్రమయుగం,మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో భ్రమయుగంను తెలుగులో కూడా విడుదలచేశారు.రెస్పాన్స్ అయితే రాలేదు.ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.అందులో ప్రేమలు ఈ శివరాత్రికి విడుదలకానుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.చిన్న సినిమా గా వచ్చి ప్రేమలు సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న ఆయ్
టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్స్ట్ మొదటి వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బ్యానర్ పెద్ద సినిమాలను మాత్రమే కాదు చిన్న చిన్న సినిమాలు కూడా నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రూపొందించనున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఈసినిమా రాబోతుంది.

సలార్ 2 పై బాబి సింహా ఇంట్రస్టింగ్ అప్ డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన కథే ఈసినిమా. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి…

కుంభమేళాలో నన్ను నిజంగా అఘోరా అనుకొని.. విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఓ మేడం అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థమన్ చేతుల మీదుగా ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

ప్రేమలు తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. గిరీష్ దర్శకత్వంలో రీసెంట్ గా మలయాళంలో వచ్చిన సినిమా ప్రేమలు. ఈసినిమా అక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో రిలీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు.