కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 18

Kannappa Manchu Mohan Babu as Mahadeva Shastri Intro Lyrical Song Released
సాంగ్

కన్నప్ప నుండి మోహన్ బాబు ఇంట్రో సాంగ్ రిలీజ్

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Nilavuku Enme lEnnadi Kobam streaming on prime video from march 21
ఓటీటీ

ఓటిటిలోకి రానున్న ధనుష్ నీక్

తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం (నీక్).ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ ,అనికా సురేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించగా వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.అయితే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ కూడా అదే టైం లో రిలీజ్ కావడంతో నీక్ కు రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు.

Mahender Reddyవాట్సాప్
Ram 22 Rajahmundry schedule is wrapped
షూటింగ్ అప్‌డేట్

రామ్ 22 రాజమండ్రి షెడ్యూల్ కంప్లీట్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి ఈసినిమా రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకోగా నిన్నటి తోఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. 34 రోజుల పాటు జరిగిన ఈషెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తోపాటు కీలక సన్నివేశాలను అలాగే రెండు పాటలను చిత్రీకరించారు. షార్ట్ బ్రేక్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.గోదావరి బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Director Nag Ashwin Excited on Yevade Subramanyam Re Release
సినిమా వార్తలు

ఎవడే సుబ్రహ్మణ్యం.. లవ్ ఎటాచ్‌మెంట్ వున్న రేర్ ఫిల్మ్

'ఎవడే సుబ్రహ్మణ్యం ఒక లవ్ ఎటాచ్మెంట్ వున్న అరుదైన సినిమా. పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్ గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలవెంట్ గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమాకి ఇప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. రీరిలీజ్ లో సినిమాని ఎంతమంది చూస్తారో అందులో టెన్ పెర్సెంట్ ఆడియన్స్ బెటర్ గా ఫీల్ అయితే, ఒక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్లకి ఇస్తే థట్స్ గ్రేట్' అని అన్నారు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.

Srikanth Mవాట్సాప్
court 5 days collections
బాక్సాఫీస్

కోర్ట్ 5 డేస్ కలెక్షన్స్

నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ వీక్ డేస్ లో సాలిడ్ గా హోల్డ్ చేస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. సోమవారం 4కోట్ల గ్రాస్ రాబట్టిన ఈసినిమా మంగళవారం మరో 4కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడం మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో కోర్ట్ థియేటర్లలో డ్రీం రన్ కనబరుస్తుంది.రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ వచ్చే వరకు కోర్ట్ ఇదే రన్ ను కొనసాగించనుంది.

Mahender Reddyవాట్సాప్
Director Nag Ashwin Gives Interesting Update About Kalki 2
సినిమా వార్తలు

కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ కీలక పాత్రల పోషించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్యూ అండ్ ఏ సెషన్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానాలు ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' Salaar Crossing 1 Cr in Advance Bookings For Re-release
సినిమా వార్తలు

సలార్ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్ వసూళ్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Aditya 369 Re Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

ఆదిత్య 369 రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. బాలయ్య సరసన మోహిని కథానాయికగా నటించగా, అమ్రిష్ పురి, టిన్ను ఆనంద్, అన్నపూర్ణ, సుత్తివేలు, శ్రీలక్ష్మి, మాస్టర్ తరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Legendary Music Director Ilaiyaraaja Meets PM Modi
సినిమా వార్తలు

ప్రధాని మోదీని కలిసిన 'ఇసైజ్ఞాని'

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్, 'ఇసైజ్ఞాని' ఇళయరాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ''మోదీజీతో ఈ భేటీ నాకు చిరస్మరణీయమైనది. నా 'సింఫొనీ-వాలియంట్‌' సహా పలు అంశాల గురించి ఇరువురం చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకి హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని అందులో తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Daring and Dashing Director Puri Jagannadh To Announce Crazy Project Soon
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్న పూరి జగన్నాథ్

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. అయితే గత కొంతకాలంగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న పూరి ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన తదుపరి ప్రాజెక్టుని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని యోచిస్తున్నాడు. దీంతో తాను తీయబోయే సినిమాలో స్టార్ క్యాస్టింగ్‌ని ఎంచుకోనున్నాడు.

Srikanth Mవాట్సాప్
MAD Square run time has been locked
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ కు షాకింగ్ రన్ టైం ఫిక్స్

మచ్ అవైటెడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో టీం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది.ట్రైలర్ రావాల్సివుంది. సాంగ్స్ కూడా బాగున్నాయ్. ఫస్ట్ పార్ట్ లోలాగే కామెడీ వర్క్ అవుట్ అయితే మ్యాడ్ స్క్వేర్ ఈజీగా 50కోట్ల క్లబ్ చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran is on board for sharwa 38
సినిమా వార్తలు

శర్వా 38లో హీరోయిన్ ఫిక్స్

యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు వున్నాయి.అందులో రెండు సెట్స్ మీద ఉండగా మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.అదే సంపత్ నంది తో చేయనున్న 38వ సినిమా.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్,శర్వా కు జంటగా నటించనుంది.ఇంతకుముందు వీరిద్దరు కలిసి శతమానం భవతి లో నటించారు.ఆసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కలిసి నటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
good bad ugly first single is out now
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఓజి సంభవం అంటూ వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంది.అయితే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ త్వరలోనే రానుంది.ఈసినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Priyadarshi's Sarangapani Jathakam New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

Srikanth Mవాట్సాప్
Vaccharroi Song Out From MAD Square
సాంగ్

మ్యాడ్ స్క్వేర్ నుండి 'వచ్చారోయ్' సాంగ్ రిలీజ్

కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మ్యాడ్‌' సినిమాకి సీక్వెల్‌గా 'మ్యాడ్‌ స్క్వేర్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
Hero Sushanth First Look Poster Released From His New Film SA10
ఫస్ట్ లుక్

SA10 నుండి సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సుశాంత్ అనుమోలు తన ప్రాజెక్టులతో చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు. తన మైల్ స్టోన్ 10వ మూవీ #SA10ని సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ చిట్టేటి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Dragon is coming to netflix
ఓటీటీ

ఓటిటిలోకి రానున్న డ్రాగన్

లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే 100 కోట్లు కొట్టాడు తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాకు తనే డైరెక్టర్ కూడా.ఇక దీని తర్వాత హీరోగా చేసిన సినిమా డ్రాగన్. రీసెంట్ గా విడుదలైన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై 20 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Mohanlal's L2 Empuraan to be Released in Telugu by Dil Raju's Sri Venkateswara Creations
సినిమా వార్తలు

మోహన్‌ లాల్ 'L2: ఎంపురాన్' తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth and Lokesh Kanagaraj's Coolie Shoot Wrapped up
షూటింగ్ అప్‌డేట్

కూలీ షూటింగ్ పూర్తి

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధిమారన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
court 4 days collections
బాక్సాఫీస్

కోర్ట్ నాలుగో రోజు కూడా

స్టార్ హీరో నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.సూపర్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించి 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో కోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా 28.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్